శుక్రుడు విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికి నాయకుడు. జాతకంలో శుక్రుడు స్థానం సరిగ్గా ఉంటే దేనికి లోటు ఉండదు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. మార్చి నెలలో చూసుకున్నట్లయితే, శుక్రుడు రెండు సార్లు తన సంచారాన్ని మార్చబోతున్నాడు. మార్చి 26, అంటే ఇంకో రెండు రోజుల్లో శుక్రుడు సంచారంలో చాలా మార్పు రాబోతోంది. శుక్రుడు కేవలం మేషరాశిలోకి ప్రవేశించడమే కాదు, అశ్విని నక్షత్రంలో కూడా ప్రవేశిస్తాడు.

ద్రిక్ పంచాంగం ప్రకారం, శుక్రుడు ఇలా మార్చి 26న మేషరాశిలోకి, అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించడంతో డబుల్ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. శుక్రుడు డబుల్ సంచారంతో కొన్ని రాశుల వారు విపరీతమైన లాభాలను పొందుతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరో, వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
శుక్రుడు డబుల్ సంచారం.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు
1.మేష రాశి:
మేష రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం, అశ్విని నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి వ్యక్తిత్వం మెరుగు పడుతుంది. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కెరీర్‌లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు అద్భుతమైన సమయం. ప్రేమ జీవితంలో ఆనందం పెరుగుతుంది.
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఇది శుభ ఫలితాలను తీసుకొస్తుంది. శుక్రుడి డబుల్ సంచారం ఈ రాశి వారికి కెరీర్‌లో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ రాశి వారు ప్రమోషన్ పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ప్లాన్లు వేస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.
3.తులా రాశి:
తులా రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. శుక్రుడు సంచారంలో మార్పు రావడంతో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
4.వృషభ రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. శుక్రుడు సంచారంలో మార్పు రావడంతో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
4.వృషభ రాశి:
{{/usCountry}}వృషభ రాశి వారికి ఇది శుభప్రదమైన సమయం. శుక్ర సంచారంలో మార్పు రావడంతో ఈ రాశి వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. విదేశాల నుంచి కూడా ప్రయోజనాలు కలుగుతాయి. రిలేషన్‌షిప్ బాగుంటుంది. సంతోషంగా ఉంటారు. ప్రశాంతత ఉంటుంది.
5.మీన రాశి:
మీన రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న టాస్కులు అన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభప్రదమైన సమయం. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. బంధం దృఢంగా మారుతుంది.