...
...
Next Story

Venus Transit 2026: మీనరాశిలో శుక్ర సంచారం, ఈ రాశులకు డబ్బు, విలాసాలు, అందమైన ప్రేమ జీవితంతో పాటు అనేకం!

గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితంలో కూడా చాలా మార్పులు తీసుకొస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు శుభ యోగాలను తీసుకు వస్తుంది. గ్రహాల సంచారంలో మార్పు 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్ని రాశుల వారు లాభాలను పొందుతారు.

Published on: Feb 17, 2026, 16:30:12 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితంలో కూడా చాలా మార్పులు తీసుకొస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు శుభ యోగాలను తీసుకు వస్తుంది. గ్రహాల సంచారంలో మార్పు 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్ని రాశుల వారు లాభాలను పొందుతారు, కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొంటారు.

శుక్ర సంచారం

Venus Transit 2026: మీనరాశిలో శుక్ర సంచారం, ఈ రాశులకు డబ్బు, విలాసాలు, అందమైన ప్రేమ జీవితం (pinterest)
Venus Transit 2026: మీనరాశిలో శుక్ర సంచారం, ఈ రాశులకు డబ్బు, విలాసాలు, అందమైన ప్రేమ జీవితం (pinterest)

శుక్రుడు డబ్బు, సంపద, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే శుక్రుడి అనుగ్రహంతో డబ్బు, సంతోషం, సంపదకు లోటు ఉండదు. ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చు. 2026 ప్రారంభమై రెండు నెలలు అవుతోంది. మరి కొన్ని రోజుల్లో మార్చి నెలలోకి అడుగుపెడుతున్నాము. మార్చి 2న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది. మరి మీ జీవితంలో కూడా ఏమైనా మార్పులు రాబోతున్నాయా? లాభాలను పొందబోతున్నారా? తెలుసుకోండి.

మార్చి నుంచి కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు.. శుక్ర సంచారంతో కష్టాలు తొలగిపోతాయి

1.వృషభ రాశి:

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు శుక్ర సంచారంతో అనేక లాభాలను పొందుతారు. రానున్న రెండు నెలలు కూడా ఈ రాశి వారికి బాగుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. వ్యాపారంలో కూడా భారీగా లాభాలు వస్తాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఏ పని మొదలు పెట్టినా విజయాలను అందుకుంటారు. ఆనందానికి లోటు ఉండదు. సకల సౌకర్యాలను పొందుతారు. కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది.

2.మిధున రాశి:

3.కన్యా రాశి:

కన్యా రాశికి ఈ శుక్ర సంచారం బాగా కలిసి వస్తుంది. మార్చి నెలలో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ఆస్తులను సంపాదిస్తారు. జీవితం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం.

4.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు శుక్ర సంచారంలో మార్పు రావడంతో ఊహించని లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. విదేశీ అవకాశాల ద్వారా లాభాలను పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. వాహనాలు, ఇల్లు, విలాసవంతమైన జీవితం ఇలా అనేక ప్రయోజనాలను చూస్తారు.

5.తులా రాశి:

తులా రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడి కారణంగా ఈ రాశి వారు ప్రమోషన్లను పొందుతారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభసమయం. ఆర్థికపరంగా ఎన్నో లాభాలను పొందుతారు. వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ రాశి వారి బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది.

6.మకర రాశి:

మకర రాశికి కూడా అనేక లాభాలు కలుగుతాయి. శుక్ర సంచారం కారణంగా ఈ రాశి వారికి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. జీతం పెంపును చూస్తారు. ఆకస్మిక లాభాలను పొందుతారు. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ప్రేమికుడు లేదా జీవిత భాగస్వామి వీరి జీవితంలోకి వస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe