గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం, శుక్రుడు వృషభ , తులా లేదా మీన రాశిలో ఉన్నప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాజయోగం ఏప్రిల్ 19న ఏర్పడిపోతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు, అందం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు మాలవ్య మహాపురుష రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇది ఐదు రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. మరి అదృష్ట రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది.. ఐదు రాశులకు లాభాలు
1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి శుక్రుడు వృషభ రాశిలోకి సంచరించడంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చూస్తే కూడా కలిసి వస్తుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.
2.సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ శుక్ర ప్రభావం కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. కెరీర్‌లో సక్సెస్ చూస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. ప్రభుత్వం లేదా పాలిటిక్స్‌లో ఉన్నవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవితంలో స్థిరత్వం ఉంటుంది.
3.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ మాలవ్య రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది. వైవాహిక జీవితంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. ఆర్థికపరంగా బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది.
4.మకర రాశి:
మకర రాశి వారికి ఈ రాజయోగం అద్భుతంగా ఉంటుంది. అనేక విధాలుగా మార్పులను చూస్తారు. ప్రేమ పెరుగుతుంది. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. పూర్వికుల నుంచి ఆస్తులను పొందుతారు.
5.కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఇది అద్భుత సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. శుక్ర సంచారంతో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. రిలేషన్షిప్ బాగుంటుంది. విలాసాలపై ఇన్వెస్ట్ చేస్తారు. మొత్తం మీద మాలవ్య రాజయోగం మీకు కూడా బాగా కలిసి వస్తుంది.
{{/usCountry}}కుంభ రాశి వారికి ఇది అద్భుత సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. శుక్ర సంచారంతో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. రిలేషన్షిప్ బాగుంటుంది. విలాసాలపై ఇన్వెస్ట్ చేస్తారు. మొత్తం మీద మాలవ్య రాజయోగం మీకు కూడా బాగా కలిసి వస్తుంది.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.