...
...
Next Story

చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు - ఆగస్టు 25 నుంచి ఈ 4 రాశులకు అదృష్ట యోగం, మీ వైపే విజయం!

ఆగస్టు 25న శుక్రుడు.. కుజుడికి చెందిన చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. శ్రావణ పూర్ణిమ చంద్రగ్రహణానికి ముందే జరిగే ఈ నక్షత్ర మార్పు వల్ల 4 రాశుల వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభించనున్నాయి.

Published on: Aug 14, 2026, 14:55:30 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సంపద, వైభవం, భౌతిక సుఖాలు, ఐశ్వర్యం, ఆకర్షణకు అధిపతిగా శుక్ర గ్రహాన్ని భావిస్తారు. జాతకంలో శుక్రుడి స్థితి అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో భోగభాగ్యాలకు కొదవ ఉండదు. కాగా…. 2026 ఆగస్టు 25న మధ్యాహ్నం 12:55 గంటలకు శుక్రుడు కుజుడికి చెందిన 'చిత్తా' నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. సెప్టెంబర్ 11 వరకు శుక్రుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు.

చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు
చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు

ఈ నక్షత్ర మార్పు జరిగిన కొద్ది రోజులకే అంటే ఆగస్టు 28న శ్రావణ పూర్ణిమ రోజున ఈ సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం సంభవించబోతోంది. గ్రహణానికి సరిగ్గా ముందు గ్రహాల అధిపతి అయిన కుజుడి నక్షత్రంలోకి శుక్రుడు మారడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిత్రా నక్షత్రానికి అధిపతి కుజుడు కావడంతో, ఈ సంచారం వల్ల వ్యక్తిగత సాహసం, సృజనాత్మకత మరియు భౌతిక అనుకూలతలు పెరుగుతాయి. శుక్రుడి ఈ నక్షత్ర గోచారం మొత్తం 12 రాశులపైనా తన ప్రభావాన్ని చూపుతుంది. అయితే, ముఖ్యంగా 4 రాశుల వారికి మాత్రం ఊహించని ధనలాభాలు, కెరీర్‌లో అద్భుతమైన పురోగతిని అందించబోతోంది.

మేష రాశి :

మేష రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు, ఆశించిన పురోగతి లభిస్తాయి. గతంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు, ఆకర్షణ పెరుగుతాయి. వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు (న్యూ డీల్స్) కుదుర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారికి విశేష లాభాలు సమకూరుతాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.

వృషభ రాశి :

తులా రాశి వారికి చిత్రా నక్షత్రంలో శుక్రుడి సంచారం మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోతాయి. భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. నూతన వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. కొత్త ఆదాయ మార్గాలు సుగమమై ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఊహించని పురోగతి కనిపిస్తుంది.

వృశ్చిక రాశి :

రాశి వారికి ఈ కాలంలో కొత్త ఉద్యోగావకాశాలు తలుపు తడతాయి. లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సామాజికంగా ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం వల్ల చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ధన ప్రవాహం పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ కష్టానికి తగ్గ గుర్తింపు దక్కడంతో పాటు ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe