శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి ఖర్చులు, ఒత్తిడి పెరిగే అవకాశం!

జ్యోతిష్య ప్రకారం శుక్రుడు సుఖసంతోషాలు, ధనం, వైభవానికి, రాహువు భ్రమలు, ఆకస్మిక పరిణామాలకు సూచకుడిగా భావిస్తారు. శుక్రుడు రాహువు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో కొన్ని రాశుల వారు ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

Published on: Oct 8, 2026, 09:30:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని సుఖసంతోషాలు, ధనం, వైభవం, విలాసాలకుకారకుడిగా భావిస్తారు. అలాగే రాహువును భ్రమ లేదా ఆకస్మిక పరిణామాలకు కారకుడిగా చెబుతారు. తులా రాశికి అధిపతి అయిన శుక్రుడు, అదే రాశిలో ఉన్న రాహువు నక్షత్రమైన 'స్వాతి నక్షత్రం'లోకి ప్రవేశించడం కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి సవాళ్లను తెచ్చిపెడుతోంది. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ సమయంలో కొన్ని రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి ఖర్చులు, ఒత్తిడి పెరిగే అవకాశం!
శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి ఖర్చులు, ఒత్తిడి పెరిగే అవకాశం!

స్వాతి నక్షత్రంలో శుక్రుడు.. ఈ రాశులకు సమస్యలు ఉండచ్చు

1. మేష రాశి

మేష రాశి వారికి శుక్రుడి ఈ నక్షత్ర మార్పు వైవాహిక జీవితంలో తీవ్ర ఒత్తిడిని తీసుకురావచ్చు. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. చిన్న విషయాలకే వివాదాలు, అపార్ధాలు రావచ్చు. బంధాల్లో నమ్మకం సడలి, ఊహించని భ్రమలు ఏర్పడే సూచనలున్నాయి. వ్యాపార రంగంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి, దీనివల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది.

2. కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ కాలం మిశ్రమ ఫలిలాలను ఇస్తుంది. ధనలాభం ఉన్నప్పటికీ, అదే స్థాయిలో ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఈ ఖర్చుల కారణంగా ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా దిగజారే ప్రమాదం ఉంది. ఆరోగ్యం మందగించవచ్చు. బంధువుల నుంచి లేదా ఆత్మీయుల నుంచి ఎలాంటి చెడు వార్తినైనా వినాల్సి రావచ్చు. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి.

3. సింహ రాశి

సింహ రాశి వారికి శుక్రుడి సంచారం కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాబడి సాధారణంగానే ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు సతతం చేస్తాయి. వ్యాపారం చేసేవారు పార్టనర్‌షిప్‌లో సమస్యలను ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో మనస్పర్థలు రాకుండా వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

4. వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేకుండానే అనవసర ప్రయాణాలు, పరుగులాటలు పెరుగుతాయి. అనుకోని ఖర్చులు మీ బడ్జెట్‌ను తలకిందులు చేస్తాయి. రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య వేధించవచ్చు. మానసిక ప్రశాంతత కరువై సతమతమవుతారు. కాబట్టి ఆదాయానికి, ఖర్చులకు మధ్య సరైన సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం.

5. ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ గోచార కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ధనం సంపాదించడంలో కొన్ని కష్టాలు ఎదురైనా, ఎట్టకేలకు డబ్బు చేతికి అందుతుంది. భౌతిక సుఖ సంతృప్తిలో లోపం ఏర్పడవచ్చు. ఎంత కష్టపడినా తగిన ఫలితం దక్కకపోవడంతో మనసు అశాంతిగా ఉంటుంది. అయితే, నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. వ్యాపారపరమైన పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది.

6. మీన రాశి

మీన రాశి వారికి రాహు నక్షత్రంలో శుక్రుడి సంచారం ఏమాత్రం అనుకూలంగా లేదు. ఈ కాలంలో కెరీర్, ఆర్థిక అంశాలు, ఆరోగ్యం మరియు కుటుంబ విషయాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ఓపికతో, శాంతియుతంగా పరిష్కరించుకోవడం మీ భవిష్యత్తుకు మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More