Weekly Horoscope: జూలై 5-11 వరకు ఈ 5 రాశుల వారికి అదృష్టం తలుపుతట్టనుంది.. ధనం, ప్రమోషన్లకు యోగం!
జూలై 5 నుంచి 11, 2026 వరకు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండనుంది. వృషభ, మిథున, సింహ, తుల, మకర రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం వంటి రంగాల్లో శుభఫలితాలు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.
రాబోయే వారం గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత కీలకమైనవి. జూలై 5 నుంచి 11, 2026 మధ్య కాలంలో గ్రహాల కదలికలు మెజారిటీ రాశుల వారికి సానుకూల ఫలితాలను అందించనున్నాయి. ముఖ్యంగా ఐదు రాశుల వారు అదృష్టాన్ని పొందే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఆ రాశులేమిటి, ఈ వారం వారికి ఏయే రంగాల్లో కలిసి రానుందో వివరంగా తెలుసుకుందాం.

ఈ రాశులకు రాబోయే వారం అద్భుతంగా ఉంటుంది
1.వృషభ రాశి: ఆర్థిక లాభాల బాట
వృషభ రాశి వారికి ఈ వారం ఆశించిన ఫలితాలు అందుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆశించిన లాభాలు చేకూరడంతో పాటు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభించడం లేదా ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులను గడువులోపు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే సూచనలు ఉన్నప్పటికీ, శుభకార్యాల కోసం ఖర్చులు కూడా ఉంటాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
2.మిథున రాశి: కెరీర్‌లో కొత్త శిఖరాలు
మిథున రాశి వారికి ఈ వారం శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఆశించిన ఫలితాలు అందుతాయి. కార్యాలయంలో మీ నాయకత్వ లక్షణాలను అందరూ గుర్తిస్తారు. మీ పనితీరుకు ముగ్ధులైన ఉన్నతాధికారులు కీలక బాధ్యతలు అప్పగించవచ్చు. వ్యాపారంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురైనా, చివరకు లాభాల్లోనే ముగిస్తారు. తోడబుట్టిన వారి నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి.
3.సింహ రాశి: పదోన్నతి, కీర్తి ప్రతిష్టలు
సింహ రాశి వారికి ఈ వారం కెరీర్‌లో ఎదుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మీ సృజనాత్మకతను, పని సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. పెట్టుబడి పెట్టడానికి అనువైన సమయం. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంతో కలిసి కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది.
4.తుల రాశి: అదృష్టం మీ వెంటే
తుల రాశి వారికి ఈ వారం అదృష్టం తోడుగా ఉంటుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీ మాటతీరు ఇతరులను ఆకట్టుకుంటుంది, దీని వల్ల ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. కుటుంబంతో కలిసి చిన్నపాటి విహారయాత్రలు చేసే సూచనలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది.
5.మకర రాశి: సమస్యలకు పరిష్కారం
మకర రాశి వారికి ఈ వారం ఎంతో ఊరటనిస్తుంది. కుటుంబపరంగా ఉన్న చిక్కుముళ్లు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నవారికి విజయం దక్కుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు చేపడితే ఆశించిన ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


