ఐస్‌క్రీమ్‌ని ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? ఎండల్లో అయినా, చలికాలంలో అయినా సీజన్‌తో పని లేకుండా ఐస్‌క్రీమ్స్‌ని తింటూ ఉంటారు. ఇష్టమైన ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ మన వ్యక్తిత్వాన్ని ఎలా చెబుతుంది? మన ప్రవర్తన, వ్యక్తిత్వం ఇష్టమైన ఐస్‌క్రీమ్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి మీకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ ఏంటి? మీకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ మీ గురించి ఏం చెబుతుందో ఇప్పుడు చూడండి.

రాశుల ఆధారంగా, నక్షత్రాల ఆధారంగా, పుట్టిన నెల ఆధారంగా, పేరులో మొదటి అక్షరం ఆధారంగా, చేతిరాత ఆధారంగా ఎలా అయితే వ్యక్తిత్వం, తీరు, ప్రవర్తన, భవిష్యత్తు గురించి చెప్పచ్చో, ఇష్టమైన ఐస్‌క్రీమ్ ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పచ్చు. ఐస్‌క్రీమ్ కేవలం రుచి కాదు, మనస్తత్వానికి కూడా అద్దం పడుతుంది అని మానసిక నిపుణులు అంటున్నారు. ఐస్‌క్రీమ్ రుచులకు, మనుషుల మనస్తత్వానికి లింక్ ఉందని భావిస్తారు.
అంచనా వెనుక ఉన్న సైకాలజీ ఏంటి?
ఐస్‌క్రీమ్ ఫ్లేవర్స్ ద్వారా మనుషుల గుణగణాలను అంచనా వేయొచ్చు. ఎందుకు సైకాలజిస్టులు మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తారు.అందులో మొదటిది స్టిమ్యులస్ రెస్పాన్స్. ఇందులో ఐస్‌క్రీమ్ తినేటప్పుడు కలిగే పూర్తి అనుభూతిని గురించి గమనిస్తారు. ఐస్‌క్రీమ్ కవర్ విప్పడం, నోట్లో కరిగిపోయే విధానం, ఇదంతా కూడా ఇందులో భాగమే.
ఈ సమయంలో వారికి కలిగే భావోద్వేగాల గురించి అడిగి తెలుసుకుంటారు. ఇక రెండవది సైకోమెట్రిక్ విశ్లేషణ. దీని ద్వారా మానసిక స్థితిని, వ్యక్తిగత లక్షణాలను విశ్లేషించడం జరుగుతుంది. మూడవది స్పెక్ట్రమ్ ఆఫ్ మూడ్. ఈ చివరి దశలోనే మనం ఐస్‌క్రీమ్ ఫ్లేవర్స్ ద్వారా మనుషుల నైజం ఎలా ఉంటుందో చెప్పచ్చు.
ఐస్‌క్రీమ్ ఫ్లేవర్స్ ఏం చెప్తున్నాయి?
1.వెనిలా ఫ్లేవర్
వెనిలా ఫ్లేవర్‌ని ఇష్టపడేవారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎక్కువగా తినేవారు భద్రతను, ప్రశాంతతను కోరుకుంటారు. స్వచ్ఛత, మనసుకు ఇది ప్రశాంతతను అందిస్తుంది. ఒడుదొడుకులు ఏమీ లేకుండా జీవితంలో స్థిరంగా ఉండాలని మీరు కోరుకుంటారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు వెనిలా ఐస్‌క్రీమ్‌ని తినడానికి ఇష్టపడతారు. దీంతో వారికి రిలీఫ్ కలుగుతుంది.
2.చాక్లెట్ ఫ్లేవర్
{{/usCountry}}వెనిలా ఫ్లేవర్‌ని ఇష్టపడేవారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎక్కువగా తినేవారు భద్రతను, ప్రశాంతతను కోరుకుంటారు. స్వచ్ఛత, మనసుకు ఇది ప్రశాంతతను అందిస్తుంది. ఒడుదొడుకులు ఏమీ లేకుండా జీవితంలో స్థిరంగా ఉండాలని మీరు కోరుకుంటారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు వెనిలా ఐస్‌క్రీమ్‌ని తినడానికి ఇష్టపడతారు. దీంతో వారికి రిలీఫ్ కలుగుతుంది.
2.చాక్లెట్ ఫ్లేవర్
{{/usCountry}}చాక్లెట్ ఫ్లేవర్‌ని ఇష్టపడేవారు బోల్డ్ గా, ఉత్సాహంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. సంతోషంగా ఉండడానికి చూస్తారు. ఏ విషయానికీ కూడా వీరు ఏ మాత్రం భయపడరు. ఒంటరిగా ప్రశాంతతను ఆస్వాదించాలని కోరుకుంటారు. అలాగే తమ సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
3.మింట్ చాక్లెట్ చిప్
ఈ ఫ్లేవర్‌ని ఇష్టపడేవారు సృజనాత్మకతతో ఉంటారు. ఎలాంటి పరిస్థితులైనా సరే సులభంగా బ్యాలెన్స్ చేస్తారు. కష్టమైన పరిస్థితులను కూడా నవ్వుతూ దాటేస్తారు.
4.స్ట్రాబెర్రీ ఫ్లేవర్
స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ ఇష్టపడేవారు సున్నిత మనస్కులు. ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచిస్తారు. అంతేకాదు, ఒకసారి వీరు ఎవరితోనైనా స్నేహం చేస్తే వారి కోసం ప్రాణాలు ఇస్తారు. వీరిలో ఎక్కువ మంది ఇంట్రోవర్ట్స్‌గా ఉంటారు.
5.మ్యాంగో లేదా ఫ్రూట్ ఫ్లేవర్స్
మ్యాంగో లేదా ఫ్రూట్ ఫ్లేవర్స్‌ని ఇష్టపడేవారు పాజిటివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా ఉంటారు. అలాగే కొత్త విషయాలను నేర్చుకోవడానికి కూడా ఎప్పుడూ ముందుంటారు. నలుగురి మధ్య ప్రత్యేకంగా నిలవాలని అనుకుంటారు. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు.
6.బటర్‌స్కాచ్
బటర్‌స్కాచ్ ఫ్లేవర్‌ని ఇష్టపడేవారు క్రమశిక్షణతో ఉంటారు. కష్టపడి పని చేస్తారు. నైతిక విలువలు ఎక్కువగా ఉంటాయి. కళ్లు మూసుకుని వీరిని నమ్మొచ్చు.