ఇంట్లో ఫ్రిజ్ ఎటు వైపు పెట్టాలి? దానిపై ఈ వస్తువులు అస్సలు పెట్టకూడదు!
వాస్తు ప్రకారం ఇంట్లో ఫ్రిజ్‌ను కూడా సరైన దిశలో పెట్టాలి. కొన్ని వస్తువులు దానిపై పెట్టకూడదు. పెడితే ఇంట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వాస్తు శాస్త్రంలో ఇంటిలోని ప్రతి మూలకు, అక్కడ ఉపయోగించే వస్తువులకు వాటి స్వంత ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తులో వంటగదికి అత్యున్నత స్థానం ఇచ్చారు. ఎందుకంటే ఇది ఇంటి మొత్తం ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని నియంత్రించే ప్రధాన కేంద్రం. ప్రస్తుత కాలంలో రిఫ్రిజిరేటర్ ప్రతి ఇంటిలోనూ ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. అందరూ ఫ్రిజ్‌ను కేవలం ఆహారాన్ని నిల్వ చేసే సాధనంగా మాత్రమే చూస్తారు, దానికి సంబంధించిన వాస్తు నియమాలపై శ్రద్ధ పెట్టరు.

మనలో చాలా మంది ఆకర్షణ కోసం లేదా వస్తువులను గుర్తుపెట్టుకోవడానికి ఫ్రిజ్‌పై కొన్ని వస్తువులను అంటించే అలవాటు ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. మనం చేసే ఈ చిన్న పొరపాటు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది.
చాలా మంది తమ విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ రసీదులను మర్చిపోకుండా ఉండేందుకు ఫ్రిజ్‌పై పెడతారు. లేదంటే ఫ్రిజ్ డోర్‌కు అంటించే అలవాటు ఉంటుంది. కానీ ఇది ఆర్థిక ఒత్తిడిని సూచించే ఒక ప్రతికూల అంశంగా వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల అప్పుల భారం పెరుగుతుంది. వాస్తు ప్రకారం ఇంటికి వచ్చే లక్ష్మి లేదా ఆదాయం నీటిలా ఖర్చైపోతుంది.
చాలా మంది సులభంగా తీసుకోవడానికి వీలుగా మాత్రలను లేదా మందులను ఫ్రిజ్‌పై ఉంచుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఆహారంతో పాటు మందులను కూడా ఒకే చోట ఉంచడం అశుభం. అలా చేయడం వల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు పెరగడమే కాకుండా, ఆసుపత్రి చికిత్సపై అధిక ఖర్చుకు దారితీస్తుంది.
కొన్ని రకాల అయస్కాంతాలను ఫ్రిజ్ డోర్‌కు అంటించడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. కానీ అయస్కాంతాలు సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మానసిక అశాంతి ఏర్పడవచ్చు.
ఫ్రిజ్ పైభాగాన్ని పాత కాగితాలు, పనికిరాని వస్తువులు పడేసే చెత్తబుట్టలా వాడటం వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది. అది దురదృష్టాన్ని కొనితెచ్చుకోవడం లాంటిది.
హింసను సూచించే జంతువుల ఫోటోలను గానీ, మరణించిన పూర్వీకుల ఫోటోలను గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌పై పెట్టకూడదు. ఇంట్లో పితృదేవతలకు ఒక ప్రత్యేకమైన పవిత్ర స్థానం ఉంది.
ఫ్రిజ్‌ను ఏ దిశలో పెట్టాలి?
వంటగదిలో ఫ్రిజ్‌ను ఎల్లప్పుడూ పడమర, నైరుతి లేదా వాయువ్య దిశలో ఉంచడం మంచిది. ఏ కారణం చేత కూడా దానిని ఈశాన్య దిశలో పెట్టకూడదు. ఎందుకంటే ఇది సంపద ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. మొత్తమ్మీద ఫ్రిజ్ అన్నపూర్ణేశ్వరికి ప్రతీక, దానిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం ఇంటికి ఆనందం, శాంతి, ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


