వాస్తు ప్రకారం ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్‌ను ఏ దిశలో పెట్టాలి, మీరూ ఈ పొరపాట్లు చేస్తున్నారా?
వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో పెట్టే వస్తువులను సరైన దిశలో పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. మిక్సీ, గ్రైండర్, మైక్రోవేవ్, ఎయిర్ ఫ్రయర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇలా చాలా వస్తువులను వాడుతూ ఉంటాము. వీటిని వాస్తు ప్రకారం పెట్టడం వలన ఇబ్బందులు ఉండవు. వాస్తు ప్రకారం సరైన దిశలో పెడితే సంపద, సంతోషం కలుగుతాయి.
చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. నిజానికి వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో ఉండే వస్తువులను వాస్తు ప్రకారం పెట్టడం వలన సానుకూల మార్పులు కలుగుతాయి, ప్రతికూల శక్తి మాయమైపోతుంది. అలాగే వంట గదిలో కూడా వాస్తు నియమాలను పాటించాలి.

వంట గదిలో వాస్తు నియమాలు
వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో పెట్టే వస్తువులను సరైన దిశలో పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. మిక్సీ, గ్రైండర్, మైక్రోవేవ్, ఎయిర్ ఫ్రయర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇలా చాలా వస్తువులను వాడుతూ ఉంటాము. వీటిని వాస్తు ప్రకారం పెట్టడం వలన ఇబ్బందులు ఉండవు. వాస్తు ప్రకారం సరైన దిశలో పెడితే సంపద, సంతోషం కలుగుతాయి.
వాస్తు ప్రకారం ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్‌ను ఏ దిశలో పెట్టాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్‌ను పెట్టేటప్పుడు ఉత్తర దిశలో పెట్టడం మంచిది. ఈ దిశలో వాటర్ ప్యూరిఫైయర్ ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. ఎలక్ట్రానిక్ సామాన్లను వంట గదిలో దక్షిణ దిశలో కూడా పెట్టొచ్చు. ఓవెన్ ని పెట్టేటప్పుడు తూర్పు వైపు పెట్టండి, పడమర వైపు మాత్రం పెట్టకండి.
వాటర్ ప్యూరిఫైయర్‌ను పె తూర్పు వైపు మాత్రం పెట్టడం మంచిది కాదు. తూర్పు వైపు వాటర్ ప్యూరిఫైయర్ ఉంటే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.
వాటర్ ప్యూరిఫైయర్‌ను పడమర వైపు పెట్టొచ్చు. ఇది శుభ ఫలితాలను తీసుకొస్తుంది.
అలాగే వాటర్ ప్యూరిఫైయర్‌ను ఈశాన్యం వైపు కూడా పెట్టొచ్చు. ఈ దిశలో పెడితే అదృష్టం, సానుకూల శక్తి కలుగుతుంది. సంపద కూడా పెరగడానికి కారణం అవుతుంది.
అగ్ని, నీటి కారకాలను వేరుగా పెట్టాలి
అగ్ని, నీటి కారకాలను ఒకచోట పెట్టకండి. మంటకు సంబంధించిన గ్యాస్ స్టవ్, సిలిండర్ వంటివి ఉత్తరం వైపు పెడితే వాటర్ ప్యూరిఫైయర్ వంటి వాటిని దక్షిణం వైపు పెట్టండి. ఒకవేళ సిలిండర్, స్టవ్ వంటివి దక్షిణ దిశలో ఉంటే ప్యూరిఫైయర్‌ను ఉత్తరం వైపు పెట్టండి. అయితే నీటికి సంబంధించిన వాటిని పెట్టడానికి ఉత్తర దిశ చాలా మంచిది.
నీరు లీక్ అవ్వకూడదు
వాటర్ ప్యూరిఫైయర్ లేదా కొళాయిల నుంచి ఎప్పుడూ నీరు లీక్ అవుతూ ఉండకూడదు. నీరు లీక్ అయితే దురదృష్టం కలుగుతుంది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా నీరు లీక్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వెంటనే రిపేర్ చేయించుకోవడం వలన సమస్యలు కలగకుండా చూసుకోవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


