సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు? దీని వెనుక బలమైన కారణం ఇదే!
జననం నుంచి మరణం వరకు అన్నింటికీ కూడా సరైన విధానాన్ని పాటిస్తూ ఉంటాము. గరుడ పురాణం ప్రకారం అంత్యక్రియలకు సంబంధించి చాలా కీలక విషయాల గురించి ప్రస్తావించారు. సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు? దాని వెనుక కారణం ఏంటి? ఎప్పుడైనా శాస్త్రోత్తంగా కార్యక్రమాలు ఎందుకు చెయ్యాలి?
పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ఈ భూమి నుంచి వెళ్లిపోక తప్పదు. మన హిందూ ధర్మంలో పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి దశకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. గరుడ పురాణం ప్రకారం మనిషి అంత్యక్రియలకు సంబంధించి అనేక కీలక విషయాలను ప్రస్తావించారు. ఎప్పుడైనా సరే శాస్త్రోత్తంగా కార్యక్రమాలు చేస్తేనే ఆ ఆత్మకు శాంతి కలుగుతుంది. అందుకే ఒక మనిషి చనిపోయిన తర్వాత దహన సంస్కారాలను ఎంతో నిష్టతో, నియమాలతో జరుపుతారు.

అంతిమ సంస్కారాల వెనుక పరమార్థం ఏంటి?
మరణం అనేది శరీరానికి మాత్రమే ఏర్పడుతుందని హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తెలుస్తోంది. అయితే ఆత్మ ఎప్పటికీ శాశ్వతమైనది, అమరమైనది. దహన సంస్కారాలే మనిషి పంచభూతాల్లో కలిసిపోవడానికి సరైన మార్గం. ఒకవేళ ఎవరైనా అంత్యక్రియలను విధివిధానాల ప్రకారం నిర్వహించకపోయినట్లయితే ఆ ఆత్మకు మోక్షం కలగదని, భూలోకంలోనే ఆ ఆత్మ సంచరిస్తుందని పండితులు చెబుతున్నారు.
సూర్యాస్తమయం అయిన తర్వాత దహన సంస్కారాలు ఎందుకు చేయకూడదు?
సూర్యాస్తమయం అయిన తర్వాత దహన సంస్కారాలు చేయకూడదని అశుభంగా భావిస్తారు. సూర్యుడు వెలుగు, శక్తి, సానుకూలతకు నిదర్శనం. పగలవేళ సూర్యుడు సమక్షంలో అంత్యక్రియలు జరిపితే ఆత్మకు దేవతల ఆశీస్సులు కలుగుతాయని, ఆ వ్యక్తి స్వర్గలోక ప్రాప్తిని పొందుతారని నమ్మకం. అదే ఒకవేళ రాత్రి నిర్వహించినట్లయితే ప్రతికూల శక్తులు, అసుర శక్తుల ప్రభావం ఉంటుందని చెబుతారు. చీకటి పడ్డాక ఆత్మకు సద్గతి లభించడం కష్టమని, ఆత్మ పిశాచ రూపం ఎత్తవచ్చని పురాణాలు హెచ్చరిస్తున్నాయి.
ఎవరైనా రాత్రి చనిపోతే తర్వాత రోజు సూర్యోదయం దాకా వేచి ఉండి, అప్పుడే దహన సంస్కారాలు చేయాలని చెబుతారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో రాత్రి దహన సంస్కారం చేయాల్సి వస్తే వివిధ రకాల పరిహారాలను పాటించాల్సి ఉంటుంది.
శాస్త్రీయ, సామాజిక కారణాలు
దీని వెనుక శాస్త్రీయ, సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో రాత్రివేళ వెలుతురు సౌకర్యం ఉండేది కాదు. అడవుల్లో జంతువుల భయం కూడా ఉండేది. అలాగే స్మశాన వాటికలు ఊరికి చాలా దూరంగా ఉండేవి. చీకట్లో అంత్యక్రియలు నిర్వహించడం చాలా ప్రమాదకరం. పైగా వెలుతురు లేని చోట చితిని సరైన పద్ధతిలో పెట్టడానికి లేదా మంత్రోచ్చారణలకు బాగా కష్టమే. భద్రతా కారణాల దృష్ట్యా కూడా పగలు నిర్వహించడమే సరైన పద్దతి.
అందుకే ఒక విధంగా రాత్రిపూట అంత్యక్రియలు జరిపేవారు కాదు. భద్రతా కారణాల వల్ల కూడా పూర్వీకులు ఈ పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చి ఉండచ్చు. శాస్త్రాలను గౌరవిస్తూ, సాంప్రదాయాలను పాటిస్తూ చనిపోయిన వారిని పంపిస్తే పితృదేవతల ఆశీస్సులు కలుగుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


