రేపే హనుమాన్ జయంతి. ప్రతి ఏటా రెండు సార్లు మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. హనుమాన్ జయంతి నాడు హనుమంతుని భక్తులతో ఆరాధించడం వలన హనుమంతుని అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండవచ్చు. హనుమంతుడు కష్టాలను, బాధలను, దుఃఖాలను తొలగిస్తాడు. అందుకే ఆయనను సంకట మోచనుడు అని పిలుస్తారు. హనుమంతుడు చిరంజీవి.

అందుకనే కలియుగంలో భూమిపై ఇప్పటికీ నివసించే ఏకైక దేవుడు హనుమంతుడు అని భక్తులు నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు హనుమంతుడికి ప్రత్యేక పూజలు జరుపుతారు. భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ను పూజిస్తారు.ఇక హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారు? దాని వెనుక కారణం ఏంటి? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమాన్ జయంతిని ఎందుకు ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటాము?
ప్రతి సంవత్సరం రెండుసార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. ఒకటి చైత్ర పౌర్ణమి నాడు. ఈసారి చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునే హనుమాన్ జయంతి ఏప్రిల్ 2 అనగా రేపు వచ్చింది. అలాగే మరొకసారి హనుమాన్ జయంతిని కార్తీక కృష్ణ చతుర్దశి నాడు జరుపుకుంటాము. ఒకటి హనుమాన్ జన్మకు సంబంధించినది, ఇంకొకటి స్పృహ కోల్పోయిన హనుమంతుడు తిరిగి జీవించడానికి సంబంధించినది.
మరొకటి కార్తీక మాసం కృష్ణపక్ష చతుర్దశి స్వాతి నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తోంది. ఆ రోజును హనుమాన్ అవతార ఉత్సవంగా జరుపుతారు. హనుమంతుడి విజయ అభినందన మహోత్సవాన్ని చైత్ర మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుతాము. చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడికి రెండవ జన్మ లభించింది. అందుకని ఆ రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము.
హనుమాన్ జయంతి కథ:
పురాణాల ప్రకారం చూసినట్లయితే, ఒకసారి హనుమంతుడికి చాలా ఆకలి వేసింది. సూర్యుడిని ఒక పండు అనుకుని తినడానికి పరిగెత్తాడు. దేవేంద్రుడు ఆపడానికి ప్రయత్నించినప్పుడు సూర్యుడిపై దాడి చేశాడు. అలా బాల హనుమాన్ స్పృహను కోల్పోయాడు. తన వరంతో పుట్టిన హనుమంతుడిని చూసి పవనుడికి కోపం వచ్చి గాలిని ఆపాడు. దీంతో విశ్వంలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. దేవతలందరూ హనుమంతుడికి రెండవ జన్మను ఇచ్చారు. అదే చైత్ర పౌర్ణమి రోజు. అందుకని ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము.
హనుమాన్ జయంతి నాడు ఇలా చేస్తే అప్పులు, బాధలు తొలగిపోతాయి:
{{/usCountry}}పురాణాల ప్రకారం చూసినట్లయితే, ఒకసారి హనుమంతుడికి చాలా ఆకలి వేసింది. సూర్యుడిని ఒక పండు అనుకుని తినడానికి పరిగెత్తాడు. దేవేంద్రుడు ఆపడానికి ప్రయత్నించినప్పుడు సూర్యుడిపై దాడి చేశాడు. అలా బాల హనుమాన్ స్పృహను కోల్పోయాడు. తన వరంతో పుట్టిన హనుమంతుడిని చూసి పవనుడికి కోపం వచ్చి గాలిని ఆపాడు. దీంతో విశ్వంలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. దేవతలందరూ హనుమంతుడికి రెండవ జన్మను ఇచ్చారు. అదే చైత్ర పౌర్ణమి రోజు. అందుకని ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము.
హనుమాన్ జయంతి నాడు ఇలా చేస్తే అప్పులు, బాధలు తొలగిపోతాయి:
{{/usCountry}}హనుమాన్ జయంతి నాడు హనుమంతుని సింధూరంతో పూజిస్తే మంచిది. అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు, శత్రు బాధలు వంటివి తొలగిపోవాలంటే హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భక్తితో ఆరాధించండి.
సుందరకాండలో లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
“ఓం హం హనుమతే నమః” అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు పఠించండి.
ఉదయం తమలపాకులను సమర్పించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. మధ్యాహ్నం హనుమంతుడికి గంధంతో పూజ చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. సాయంత్రం సింధూరంతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి.