...
...
Next Story

మంగళవారం జుట్టు కత్తిరించుకుంటే అరిష్టమా? పురాణాలు, విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతున్నాయి?

మంగళవారం జుట్టు కత్తిరించుకోవడంపై మన సమాజంలో అనేక నమ్మకాలు ఉన్నాయి. దీనివల్ల ఆయుష్షు తగ్గుతుందని, అప్పుల బాధలు పెరుగుతాయని కొందరు అంటుంటారు. ఈ నమ్మకాల వెనుక ఉన్న అసలు కారణాలను ఈ కథనంలో విశ్లేషిద్దాం.

Published on: May 19, 2026, 11:30:53 IST
Advertisement

మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అగ్నితత్వానికి, రక్తం, శక్తికి చిహ్నం. శరీరంలో రక్త ప్రసరణపై కుజుడి ప్రభావం ఉంటుంది. అయితే చాలా మంది పూర్వికుల నుంచి వస్తున్న పద్ధతులను పాటిస్తూ ఉంటారు. పెద్దలు కూడా మంగళవారం కొన్ని పొరపాట్లు చేయకూడదని చెప్పడం మీరు నిత్యం వింటూ ఉంటారు. నిత్యం పాటించే ఆచారాల వెనుక బలమైన కారణం అనేది ఉంటుంది.

మంగళవారం జుట్టు కత్తిరించుకుంటే అరిష్టమా? పురాణాలు, విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతున్నాయి? (pinterest)
మంగళవారం జుట్టు కత్తిరించుకుంటే అరిష్టమా? పురాణాలు, విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతున్నాయి? (pinterest)

అందులో చాలా ముఖ్యమైనది, ఎక్కువ మంది పాటించేది మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోకపోవడం, క్షవరం చేయించుకోకపోవడం. మంగళవారం, శనివారం జుట్టు కత్తిరించకూడదని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ఇది మూఢ నమ్మకమా? దీని వెనుక శాస్త్రీయ లేదా ఆధ్యాత్మిక రహస్యం ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళవారం జుట్టు, గోళ్లు కత్తిరించుకోకూడదా? దీని వెనుక కారణం ఏంటి?

రక్త ప్రసరణపై కుజుడి ప్రభావం చాలా ఉంటుంది. జుట్టు, గోళ్లు శరీరంలోని శక్తితో ముడిపడి ఉంటాయి. కుజుడు నుంచి వచ్చే కిరణాలు మంగళవారం చాలా ప్రభావితంగా ఉంటాయి. అందుకనే జుట్టు కత్తిరించుకోకూడదని అంటారు. శరీరంలోని ప్రాణశక్తిపై ప్రతికూల ప్రభావం పడచ్చని జ్యోతిష్య పండితులు భావిస్తారు. మంగళవారం నాడు క్షవరం చేసుకుంటే కుజదోషం పెరిగే అవకాశం కూడా ఉందని పండితులు అంటున్నారు. ఒకవేళ ఇలాంటి తప్పులు చేస్తే అనవసరమైన కోపం, కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి కలగవచ్చట.

పురాణాల్లో కూడా ఈ విషయం ఉందా?

ధర్మశాస్త్రాల్లో, ముఖ్యంగా మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో దీని గురించి కొన్ని ఆధారాలు ఉన్నాయి. వారాలను బట్టి కొన్ని పనులు చేయకూడదని చెప్పడం జరిగింది. మంగళవారం జుట్టు లేదా గోళ్లు కత్తిరించుకోవడం మంచిది కాదని అందులో చెప్పబడింది. దీని వలన మనిషి ఆయుషు ఎనిమిది నెలలపాటు తగ్గిపోతుందట. ఈరోజున క్షవరం చేయించుకుంటే సోదరుల మధ్య సఖ్యత కూడా దెబ్బతింటుందని, అన్నదమ్ములకు ఆపద కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రామీణ ప్రాంతాల్లో చాలా నమ్మకం ఉంది. అందుకే మంగళవారాన్ని “అన్నదమ్ముల వారం” అని అంటారు.

శాస్త్రీయ కారణాలు

ఇప్పుడు అందరూ ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. అందుకని చాలా నియమాలను పాటించడం లేదు. కానీ నమ్మకం ఉన్నవారు ఇంకా మంగళవారం నాడు ఇలాంటి పనులు చేయకుండా చూసుకుంటున్నారు. అయితే వ్యక్తిగత నమ్మకాలు ఏ విధంగా ఉన్నా, పెద్దలు చెప్పిన మాటల వెనుక ఆరోగ్యం, క్రమశిక్షణ లాంటి అంశాలు ఉంటాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe