...
...
Next Story

ఆవు, కుక్క, కోతి, పక్షులకు ఆహారం పెడితే అదృష్టం మారిపోతుందా? శని, రాహువు, కేతువు దోషాలకు సులభ పరిహారం ఇదేనా?

జంతువులు, పక్షులకు ఆహారం ఇవ్వడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఏ జీవికి ఏ ఆహారం పెడితే జాతకంలో గ్రహాలు అనుకూలంగా మారి అదృష్టం కలిసివస్తుందో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

Published on: Jun 5, 2026, 15:00:23 IST
Advertisement

చాలామంది జంతువులకు, పక్షులకు ఆహారం పెడుతూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో జీవ కారుణ్యానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదు. మూగజీవుల ఆకలి తీర్చడం మానవత్వం మాత్రమే కాదు, బలమైన జ్యోతిష్య రహస్యాలు కూడా దీని వెనుక ఉన్నాయి.

ఆవు, కుక్క, కోతి, పక్షులకు ఆహారం పెడితే అదృష్టం మారిపోతుందా? శని, రాహువు, కేతువు దోషాలకు సులభ పరిహారం ఇదేనా?
ఆవు, కుక్క, కోతి, పక్షులకు ఆహారం పెడితే అదృష్టం మారిపోతుందా? శని, రాహువు, కేతువు దోషాలకు సులభ పరిహారం ఇదేనా?

జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు, మనం జీవితంలో రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కొన్ని జంతువులకు ఆహారం ఇవ్వడం వలన గ్రహదోషాలు తగ్గిపోతాయి, ఉపశమనం కలుగుతుంది. మరి ఏ జంతువుకు ఎలాంటి ఆహారం ఇస్తే ఏమవుతుంది, దాని వలన కలిగే లాభాలతో పాటు ఏ గ్రహాలు శాంతిస్తాయో కూడా తెలుసుకుందాం.

జంతువులకు, పక్షులకు వీటిని ఆహారంగా పెడితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి

1.ఆవుకు బెల్లం, రొట్టెలు, పచ్చగడ్డి:

ఆవును ముక్కోటి దేవతలకు నిలయంగా భావిస్తాము. ఆవుకు బెల్లం, రొట్టెలు, పచ్చగడ్డి వంటివి తినిపిస్తే గురుగ్రహం, శుక్రగ్రహం బలపడతాయి. క్రమం తప్పకుండా ఆహారం పెట్టినట్లయితే లక్ష్మీదేవి కూడా ఆ వ్యక్తి ఇంట్లో తాండవిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పరిష్కారాన్ని పాటించడం మంచిది. ఆవుకు ముఖ్యంగా గురువారం, శుక్రవారం గోసేవ చేస్తే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి.

2.నల్ల కుక్కకు:

కుక్కను కాలభైరవుడి వాహనంగా పూజిస్తాము. శనిదోషం, రాహువు-కేతువు దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కుక్కలకు ఆహారం పెడితే మంచిది. ముఖ్యంగా నల్ల కుక్కలకు నెయ్యి రాసిన రొట్టెలను, పాలను పెడితే మంచిది. దీని వలన ఆకస్మాత్తుగా వచ్చే ముప్పులు కూడా తగ్గుతాయి. పురోగతి కూడా ఉంటుంది. వీధి కుక్కలకు ఆహారం పెడితే శత్రు బాధలు, కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి వీలవుతుంది.

3.కోతులకు వీటిని పెట్టండి:

కోతులను హనుమంతుని స్వరూపంగా భావిస్తాము. కుజదోషంతో బాధపడుతున్న వారు కోతులకు వేయించిన శనగలు, అరటిపండ్లు, బెల్లం వంటివి పెడితే మంచిది. కుజగ్రహంతో పాటు సూర్య దోషాలు కూడా తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విజయాలను అందుకోవచ్చు.

4.పక్షులకు ధాన్యం:

చీమలకు, చేపలకు కూడా ఆహారం పెట్టడం మంచిది. చీమలకు చక్కెర లేదా గోధుమపిండి పెడితే చాలా ప్రయోజనాలను పొందవచ్చు. చేపలకు చెరువుల్లో పిండి ముద్దలు వేస్తే రాహు, కేతువుల ప్రభావం నుంచి బయటపడడానికి వీలవుతుంది. అలాగే ధనలాభం, మానసిక ప్రశాంతత, అప్పులు తీరిపోవడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe