...
...
Next Story

Yamuna Pushkaralu 2026: జూన్ 2 నుంచి యమునా పుష్కరాలు.. పుణ్య స్నానాల తేదీలు, ఘాట్లు, దానాల పూర్తి వివరాలు!

Yamuna Pushkaralu 2026: 12 ఏళ్ల తర్వాత వచ్చే యమునా నది పుష్కరాలు జూన్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ 12 రోజుల విశిష్టత, పుణ్య స్నాన ఘాట్లు, పితృ దోషాల విముక్తి కోసం ఏ రోజు ఏ దానం చేయాలో పూర్తి వివరాలు మీకోసం.

Published on: May 29, 2026, 11:01:09 IST
Advertisement

Yamuna Pushkaralu 2026: బృహస్పతి ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్లినప్పుడు, ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు మొదలవుతాయి. ప్రతి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సమయంలో యమునా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ కాలాన్ని యమునా పుష్కర మహోత్సవంగా భక్తులు జరుపుకుంటారు.

Yamuna Pushkaralu 2026: యమునా పుష్కరాలు.. పుణ్య స్నానాల తేదీలు, ఘాట్లు, దానాల పూర్తి వివరాలు! (pinterest)
Yamuna Pushkaralu 2026: యమునా పుష్కరాలు.. పుణ్య స్నానాల తేదీలు, ఘాట్లు, దానాల పూర్తి వివరాలు! (pinterest)

పుష్కరాల్లో మొదటి 12 రోజులను ఆది పుష్కరాలు అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని అంటారు. లక్షలాది మంది దూర ప్రాంతాల నుంచి కూడా యమునా నది తీరాలకు వచ్చి స్నానాలు, పూజలు చేస్తూ ఉంటారు.

యమునా పుష్కరాలు 2026

యమునా పుష్కరాలు జూన్ 2, మంగళవారం నాడు ప్రారంభమవుతాయి. జూన్ 13, శనివారంతో ముగుస్తాయి. యమునా నదిలో పుష్కర స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని, అలాగే పితృ దోషాల నుంచి కూడా బయటపడొచ్చని పురాణాలు చెబుతున్నాయి.

యమునా నది పుష్కరాలు 2026 – ముఖ్యమైన స్నాన ఘాట్లు:

ఢిల్లీ, యమునానగర్, బృందావన్, ఆగ్రా, అలహాబాద్ ప్రాంతాల్లో యమునా నది పుష్కర ఘాట్ల పూర్తి వివరాలు ఉన్నాయి.

శ్రీకృష్ణుడు పుట్టిన మధురలో యమునా పుష్కర సమయంలో ఈ ఘాట్లను సందర్శించొచ్చు:

బెంగాలీ ఘాట్, విశ్రాంత్ ఘాట్, స్వామి ఘాట్, కంస ఘాట్, చక్రతీర్థ ఘాట్.

బృందావనం పుష్కర ఘాట్లు:

కేశీ ఘాట్, చీర ఘాట్, కాలీయ ఘాట్, ఇమ్లీ తాలా ఘాట్.

ప్రయాగరాజ్ యమునా పుష్కర ఘాట్లు:

త్రివేణి సంగమం, సరస్వతీ ఘాట్, అరైల్ ఘాట్.

ఢిల్లీలో:

యమునోత్రి, ఆగ్రాలో కూడా ఈ పుష్కర స్నానాలు చేయొచ్చు.

యమునా పుష్కరాల్లో ఏం చేయాలి?

పుష్కర స్నానం, దానధర్మాలు, పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు, దీపదానం, యమునా హారతి, గాయత్రీ జపం, గోపూజ వంటివి చేయొచ్చు.

ఈ పుష్కర సమయంలో ఏ దానాలు చేయాలి?

పుష్కర సమయంలో 12 రోజులు ఏ దానాలు చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

మొదటి రోజు: ధన, ధాన్యాలు, భూదానం, సువర్ణ దానం, రజత దానం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.

రెండవ రోజు: వస్త్ర దానం, రక్తదానం, లవణ దానం చేయొచ్చు.

మూడవ రోజు: పూల దానం, బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు చూడొచ్చు.

నాలుగవ రోజు: నువ్వులు, నెయ్యి, పాలు, తేనె దానం చేయడం మంచిది.

ఐదవ రోజు: ధాన్య దానాలు, శకట దానం, వృషభ దానాలు చేయడం వలన మంచి జరుగుతుంది.

ఆరవ రోజు: చందనం, కస్తూరి, ఔషధాలను దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

ఏడవ రోజు: పీట, శయ్య, గృహ దానాలు చేస్తే మంచిది.

ఎనిమిదవ రోజు: చందనం, కందమూలాలు, పుష్పమాలలను దానం చేయడం మంచిది.

తొమ్మిదవ రోజు: పిండదానం, కన్యాదానం, కంబళి దానం చేయడం వలన మంచి ఫలితాలు చూస్తారు.

పదవ రోజు: కూరలు, పండ్లు వంటివి దానం చేయడం మంచిది.

పదకొండవ రోజు: గజదానం చేస్తే మంచిది.

పన్నెండవ రోజు: నువ్వుల దానం చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks