ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో వచ్చే రెండు ఏకాదశులు కూడా చాలా విశేషమైనవి. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అంటే, సంవత్సరంలో 24 సార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాము. ఈ ఏడాది జూలై 10న, అంటే ఎల్లుండి, యోగినీ ఏకాదశి రాబోతోంది. ఈ విశేష పర్వదినాన శ్రీహరిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆ శ్రీహరి అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. అయితే, యోగినీ ఏకాదశి నాడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. వీటిని పాటించడం వల్ల అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. సిరిసంపదలకు లోటు ఉండదు.
లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చెయ్యాలి?

యోగినీ ఏకాదశికి ముందు ఈ వాస్తు నియమాలను పాటించండి. యోగినీ ఏకాదశికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. జూలై 10న రానున్న ఈ పవిత్ర దినాన విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. పాపాలు తొలగిపోతాయి. పూజతో పాటు నివాస స్థలంలో వాస్తు పరమైన మార్పులు చేస్తే సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. తద్వారా శ్రీహరి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.
ప్రధాన ద్వారం ఆనందాల నిలయం
బయట నుంచి వచ్చే శక్తులన్నీ ఇక్కడి నుంచే లోపలికి ప్రవేశిస్తాయి. ఏకాదశికి ముందు ఇంటి గడపను, ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేయాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే పసుపు, కుంకుమలతో గడపకు స్వస్తిక్ గుర్తు వేయండి. ఇలా చేస్తే దరిద్రం తొలగిపోతుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి.
ఈశాన్య మూల
వాస్తు ప్రకారం ఈశాన్యం చాలా పవిత్రమైనది. ఇది దైవ స్థానం. ఈ దిశలో పాత సామాన్లు, చెత్తబుట్టలు, విరిగిపోయిన వస్తువులు వంటివి పెట్టకూడదు. అలా ఉన్నట్లయితే వాటిని ఏకాదశికి ముందే తొలగించండి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసి, గంగాజలంతో శుద్ధి చేయండి. ఇలా చేస్తే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వీలైతే ఆ గదిలో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఫోటోలు పెట్టి నిత్యం ధూప, దీప, నైవేద్యాలను సమర్పించండి.
రాళ్ల ఉప్పుతో శుద్ధి
రాళ్ల ఉప్పుతో ఇంటిని శుభ్రం చేస్తే ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. కాబట్టి రాళ్ల ఉప్పుతో శుభ్రం చేయండి. అలాగే కర్పూరం, లవంగాలను వెలిగించి, ఆ పొగను ఇల్లంతా చూపిస్తే దుష్టశక్తులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఇది ఇంటి వాతావరణాన్ని దైవత్వంతో నింపుతుంది.
లక్ష్మీ కలశం
{{/usCountry}}రాళ్ల ఉప్పుతో ఇంటిని శుభ్రం చేస్తే ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. కాబట్టి రాళ్ల ఉప్పుతో శుభ్రం చేయండి. అలాగే కర్పూరం, లవంగాలను వెలిగించి, ఆ పొగను ఇల్లంతా చూపిస్తే దుష్టశక్తులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఇది ఇంటి వాతావరణాన్ని దైవత్వంతో నింపుతుంది.
లక్ష్మీ కలశం
{{/usCountry}}లక్ష్మీ కలశాన్ని ఇంట్లో పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలను చూడొచ్చు. అలాగే ధన స్థానం లేదా బీరువా ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. అనవసరమైన కాగితాలను తొలగించాలి. ఏకాదశి నాడు పసుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్ము, గోమతి చక్రాన్ని పెట్టి డబ్బు దాచుకునే చోట ఉంచండి. ఇలా చేయడం వల్ల ధనలాభం కలుగుతుందని నమ్మకం. ఇంట్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చుల నుంచి బయటపడడానికి కూడా వీలవుతుంది.