డబ్బు సంపాదించడంలో వీరే టాప్.. ఈ 5 రాశుల వారికి ఆర్థిక నిర్వహణలో తిరుగులేదు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశి వారికి ఒక్కో విధమైన లక్షణాలు, ఆలోచనా విధానం ఉంటాయని చెబుతారు. ముఖ్యంగా డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం, పెట్టుబడుల ద్వారా సంపదను పెంచుకోవడంలో కొన్ని రాశుల వారు ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి వుంటారు.
రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, వారి భవిష్యత్తుకు సంబంధించి కూడా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది. ఒక్కో రాశి వారి తీరు, ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారు కొన్నిట్లో ఆరితేరి ఉంటారు. కొన్ని రాశుల వారికి అవి బలహీనతలు అవ్వచ్చు.

ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో హ్యాపీగా ఉండడానికి కచ్చితంగా డబ్బు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, డబ్బును అందరూ సంపాదిస్తారు, కానీ కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతారు. జ్యోతిష్యం ప్రకారం మనం చూసుకున్నట్లయితే, కొన్ని రాశుల వారు డబ్బు బాగా సంపాదించగలరు. వారి దగ్గర ఉన్న కొన్ని రూపాయలతోనే కోటి రూపాయలు చేయగలరు.మరి డబ్బును బాగా సంపాదించే రాశులు ఏవి? ఏ రాశుల వారు డబ్బును బాగా సంపాదించగలరు? ఈ రాశుల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
ఈ రాశుల వారు డబ్బును బాగా సంపాదించగలరు
కన్యా రాశి
కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు డబ్బును బాగా సంపాదించగలరు. ప్రతిరోజూ కూడా వారు తమ ఖర్చులను బాగా గమనిస్తారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోగలరు. మార్కెట్లో ధరలు మారినప్పటికీ, ఈ రాశి వారు పొదుపు పద్ధతులను మార్చుకొని, లాభాలను తెలివిగా పొందుతారు. డబ్బును ఈజీగా సంపాదిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి వారు తమ దగ్గర ఉన్న కొంచెం డబ్బుతోనే కోటి రూపాయలుగా చేయగలరు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికి కారకుడు. వీరు ఎక్కువగా విలాసాలను ఇష్టపడతారు, కానీ ఖర్చుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైనవి కొనుగోలు చేయరు. వీరి దగ్గరున్న కొంచెం మొత్తాన్ని కోట్లలోకి మార్చగలరు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు కూడా డబ్బును బాగా సంపాదిస్తారు. తెలివిగా పెట్టుబడులు పెడతారు. ఎందులో పెట్టుబడి పెట్టినా కూడా నష్టాలు మాత్రం తెచ్చుకోకుండా చూసుకుంటారు. లాభం వచ్చేదాకా కూడా వారు ముందుకు వెళ్తారు తప్ప వెనక్కి వెళ్లరు. ధైర్యంగా కష్టాలను కూడా సులువుగా అధిగమిస్తారు. ఇలా మొత్తానికి డబ్బును బాగా సంపాదిస్తారు.
మకర రాశి
ఈ రాశికి అధిపతి శని. క్రమశిక్షణ, కష్టపడి పని చేయడానికి మారుపేరు అని చెప్పొచ్చు. ఈ రాశి వారు కూడా డబ్బును బాగా పొదుపు చేస్తారు. అలాగే, ప్రతి రూపాయిని కూడా లెక్కపెట్టుకునే తత్వం ఈ రాశి వారిది. ఈ రాశి వారు తమ దగ్గర ఉన్న కొంత డబ్బుతోనే కోట్లుగా మార్చేయగలరు. ఎలాంటి అనవసరమైన ఖర్చులను పెట్టకుండా జాగ్రత్తగా ఉంటారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారు కూడా కొంచెం డబ్బును ఎక్కువ మొత్తంలోకి మార్చేయగలరు. అనవసరమైన ఖర్చులను చేయరు. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా డబ్బును సంపాదిస్తారు. ఆ డబ్బును రెట్టింపు చేసుకుంటూ ముందుకు వెళ్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


