అక్టోబర్ 18 నుంచి 24 వరకు ఈ 5 రాశులకు అదృష్టమే అదృష్టం.. డబ్బు, ఉద్యోగంలో శుభవార్తలు!

అక్టోబర్ 18 నుంచి 24 వరకు గ్రహాల సంచారం, నక్షత్ర మార్పులు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. సూర్యుడు తులా రాశిలో సంచరించడం, బుధుడు వక్రగతిలోకి వెళ్లడం, రాహువు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఐదు రాశుల వారికి  అనుకూల మార్పులు కలగవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

Published on: Oct 16, 2026, 12:30:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 18 నుంచి 24 వరకు ఉన్న ఈ వారం గ్రహాల కదలికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వారంలో సూర్యుడు నీచ రాశి అయిన తులా రాశిలో సంచరిస్తుండగా, బుధుడు ఇదే రాశిలో ఉండి అక్టోబర్ 24 నుంచి వక్రగతి పట్టనున్నారు.

అక్టోబర్ 18 నుంచి 24 వరకు ఈ 5 రాశులకు అదృష్టమే అదృష్టం.. డబ్బు, ఉద్యోగంలో శుభవార్తలు!
అక్టోబర్ 18 నుంచి 24 వరకు ఈ 5 రాశులకు అదృష్టమే అదృష్టం.. డబ్బు, ఉద్యోగంలో శుభవార్తలు!

అలాగే రాహువు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించడం, శని మీన రాశిలో ఉండటం వంటి అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నక్షత్ర, గ్రహ స్థానాల ప్రభావం వల్ల మేషం నుంచి మీన రాశి వరకు ఉన్న అన్ని రాశులపై ప్రభావం పడినప్పటికీ, ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఈ వారం కెరీర్, వ్యాపారం, ఆర్థిక స్థితి మరియు ప్రేమ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు రానున్నాయి. ఆ ప్రత్యేక రాశులు ఏవో ఇక్కడ చూద్దాం.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం అబ్బరపరిచే ఫలితాలు అందనున్నాయి. ఈ సమయంలో మీ మాట తీరుకు సమాజంలోనూ, కుటుంబంలోనూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మీరు మాట్లాడే విధానంతో ఇతరులను ఆకట్టుకుంటారు. చేతికి సంపద అందడంతో పాటు భౌతిక సుఖ సౌకర్యాలు పెరుగుతాయి.

కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వ్యాపార భాగస్వామ్యంలో మంచి లాభాలు అందుకునే అవకాశం ఉంది.

కన్యా రాశి

కన్యా రాశి జాతకులకు ఈ వారం ప్రశాంతంగా సాగిపోతుంది. అయితే ఆర్థిక విషయాల్లో మాత్రం కొద్దిగా ఆచితూచి అడుగువేయాల్సిన అవసరం ఉంది. సంపాదనతో పాటు పొదుపు చేసే సామర్థ్యం పెరుగుతుంది.

అయినప్పటికీ విలాసవంతమైన వస్తువుల కోసం కొంత ఖర్చు చేసే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలోని సమస్యలు తొలగిపోయి, ప్రేమ జీవితం మెరుగవుతుంది. వ్యాపార రంగంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఏ పని చేసినా తొందరపడకుండా ప్రశాంతంగా పూర్తి చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉంటుంది. మీ రాశికి యోగకారకుడైన శని ప్రభావం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. చేతికి తగినంత ధనం అందడంతో పాటు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.

వ్యాపారంలో భారీ పురోగతి కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో సంతోషంగా సమయం గడుపుతారు. అయితే వారం చివరిలో మాత్రం కొంత సంయమనం పాటించడం అవసరం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంది. ఇంతకాలం ఆగిపోయిన పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి కాస్త ఓపిక అవసరం.

వ్యాపారంలో భాగస్వాముల సహకారంతో ముందుకు వెళతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం అదృష్టం సంపూర్ణంగా తోడుంటుంది. మీలో సానుకూల శక్తి ఉప్పొంగుతుంది. నూతన సృజనాత్మక పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు అందుకుంటారు. పట్టుదలతో వ్యవహరించి అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు.

స్వంత ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసేయోగం ఉంది. వ్యాపారంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంలో చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమై, జీవిత భాగస్వామి ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. మనసుకి నచ్చిన ప్రాంతాలకు ప్రయాణాలు చేసే సూచనలున్నవి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More