మహబూబ్‌నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 149 పోస్టులు.. సెప్టెంబర్ 15న ఇంటర్వ్యూ
మహబూబ్‌నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 149 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
తెలంగాణలోని నిరుద్యోగ వైద్యులు, మెడికల్ ఫ్యాకల్టీ అభ్యర్థులకు మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శుభవార్త అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 149 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం 149 ఖాళీలను వివిధ హోదాల్లో భర్తీ చేస్తున్నారు: ప్రొఫెసర్ 8 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 19 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 62 పోస్టులు, ట్యూటర్ 10 పోస్టులు, జూనియర్ రెసిడెంట్ 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, పీడియాట్రిక్స్, డీవీఎల్, సైకియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, ఓబీజీ, అనస్థీషియాలజీ, రేడియో డయాగ్నసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్ మరియు ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో MBBS, MD, MS, DNB ఉత్తీర్ణులై ఉండాలి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వంటి సీనియర్ పోస్టులకు సంబంధిత బోధన లేదా పరిశోధనా అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) లో నమోదై ఉండాలి. ఇతర రాష్ట్రాల వారు ఎంపికైతే, చేరిన వారం రోజుల్లోగా TSMCలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 69 ఏళ్లలోపువారు అర్హులు. ట్యూటర్, జూనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లలోపు వయసు ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షణీయమైన వేతనం అందుతుంది. ప్రొఫెసర్: రూ. 1,90,000, అసోసియేట్ ప్రొఫెసర్: రూ. 1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్: రూ. 1,25,000, ట్యూటర్: రూ. 55,000, జూనియర్ రెసిడెంట్: రూ. 46,000 జీతం వస్తుంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, జేఆర్ PG (MD/MS/DNB) లేదా MBBS లో సాధించిన మార్కుల ఆధారంగా ఎరిట్ జాబితా రూపొందిస్తారు. ప్రొఫెసర్ / అసోసియేట్ ప్రొఫెసర్ వారి బోధనా అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ స్థానిక అభ్యర్థులకు ఎంపికలో మొదటి ప్రాధాన్యత లభిస్తుంది.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (www.gmcmbnr-ts.org) నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేయాలి. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఏదిర క్యాంపస్, తిరుమల హిల్స్, మహబూబ్‌నగర్‌లో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
నింపిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అన్ని ఒరిజినల్ విద్యార్హత, అనుభవ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకెళ్లాలి. ఇంటర్వ్యూల తేదీ సెప్టెంబర్ 15, ఫలితాలను సెప్టెంబర్ 17న వెల్లడిస్తారు. విధుల్లో చేరడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


