National Highways : తెలంగాణలోని జాతీయ రహదారులపై 1,535 బ్లాక్ స్పాట్‌లు
National Highways : తెలంగాణలోని జాతీయ రహదారులపై 1,535 బ్లాక్ స్పాట్‌లను కేంద్రం గుర్తించింది. ఈ మేరకు వాటికి మరమ్మతులు చేసింది.
తెలంగాణలోని జాతీయ రహదారులపై 1,535 బ్లాక్ స్పాట్‌లను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. వాటిలో 1259 బ్లాక్ స్పాట్‌లలో స్వల్పకాలిక మరమ్మతు పనులు పూర్తి కాగా, 516 బ్లాక్ స్పాట్‌లలో దీర్ఘకాలిక మరమ్మతు పనులు పూర్తయ్యాయి. మంత్రిత్వ శాఖ ప్రకారం, బ్లాక్ స్పాట్‌ల సవరణ అనేది ఒక నిరంతర ప్రక్రియ, తాత్కాలిక చర్యలు తక్షణ ప్రాతిపదికన తీసుకుంటారు. దేశంలోని జాతీయ రహదారులపై(NHs) గుర్తించిన 16,542 బ్లాక్ స్పాట్‌లలో, 14,138 బ్లాక్ స్పాట్‌లపై స్వల్పకాలిక సవరణ పూర్తయింది.

రహదారి భద్రతా ఆడిట్ నివేదికల ద్వారా సిఫార్సు చేసిన దీర్ఘకాలిక సవరణ చర్యలు, అవసరమని భావించిన ప్రదేశాలలో మాత్రమే అమలు చేస్తారు. దీని ప్రకారం, 6,649 ప్రమాదకర ప్రదేశాలలో దీర్ఘకాలిక చర్యలు పూర్తి అయ్యాయి. కాగా 4,077 ప్రమాదకర ప్రదేశాలకు అటువంటి దీర్ఘకాలిక చర్యలు అవసరం లేదని అంచనా.
రహదారి భద్రతను నిర్ధారించడానికి, జాతీయ రహదారుల ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణం, ప్రారంభానికి ముందు దశలతో పాటు ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులపై కూడా క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తెలిపారు.
మోటార్ వెహికల్స్ యాక్ట్-1988లోని సెక్షన్ 162 కింద ఉన్న చట్టపరమైన ఆదేశానికి అనుగుణంగా.. 'ప్రధానమంత్రి - రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి, హామీతో కూడిన చికిత్స (PM-RAHAT) పథకం తెచ్చాం. స్కీమ్ అమలు కోసం కార్యాచరణ విధానాలను వివరిస్తూ సమగ్ర మార్గదర్శకాలు జారీ చేశాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మినహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువచ్చి ఈ పథకం ఫిబ్రవరి 13, 2026న దేశవ్యాప్తంగా ప్రారంభమైంది.' అని నితిన్ గడ్కరీ అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


