జూలై 27న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో 24 గంటలు నీటి సరఫరాకు అంతరాయం

జూలై 27న హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు హైదరాబాద్ వాటర్ బోర్డు వివరాలను వెల్లడించింది.

Published on: Jul 26, 2026, 14:47:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ ఉప్పల్ జంక్షన్ వద్ద జరుగుతున్న గ్రేడ్ సెపరేటర్ నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నారు. ఇందులో భాగంగా అక్కేడే పైప్‌లైన్ జంక్షన్ పనులు చేపట్టనున్నారు. దీనివల్ల జూలై 27న ఉదయం 10 గంటల నుండి నగరంలోని అనేక ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది.

హైదరాబాద్‌లో నీటి సరఫరాలో అంతరాయ
హైదరాబాద్‌లో నీటి సరఫరాలో అంతరాయ

ఈ పనులు కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ (KWSP) ఫేజ్-II రింగ్ మెయిన్-2కు సంబంధించిన 1,600 మి.మీ వ్యాసం కలిగిన ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌కు సంబంధించినవని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB) తెలిపింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్ పీ15 ఫౌండేషన్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఈ జంక్షన్ పనులు చేపడుతున్నారు.

ఉప్పల్ జంక్షన్ నుండి వరంగల్ హైవే వైపు వెళ్లే రహదారి మూసివేసినందున ఈ పనులు అవసరమని, ఫౌండేషన్ పనులను త్వరగా పూర్తి చేయడం వల్ల భారీ వాహనాల రద్దీ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుందని హైదరాబాద్ వాటర్ బోర్డు పేర్కొంది.

నీటి సరఫరాలో అంతరాయం ఎదుర్కోనున్న ప్రాంతాలలో ఫతేనగర్, హస్మత్‌పేట్, ప్రకాష్ నగర్, నాచారం, హెచ్ఎంటీ నగర్, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్ రెడ్డి నగర్, ఉప్పల్, మేకలమండి, భోలక్‌పూర్ (కొన్ని ప్రాంతాలు), పద్మారావు నగర్, బన్సీలాల్‌పేట్, బుద్ధనగర్, తార్నాక (కొన్ని ప్రాంతాలు), సీతాఫల్‌మండి, మెట్టుగూడ, లాలాపేట్ (కొన్ని ప్రాంతాలు), నార్త్ లాలాగూడ, అడ్డగుట్ట, బాలానగర్, సౌత్ సెంట్రల్ రైల్వే సంస్థలు, ఎంఈఎస్ మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ప్రాంతాలు ఉన్నాయి.

అంతరాయం సమయంలో వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్ బోర్డ్ కోరింది. పైప్‌లైన్ పనులు పూర్తయిన తర్వాత దశలవారీగా నీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని బోర్డు తెలిపింది. జూలై 27వ తేదీన హైదరాబాద్‌లో పైన చెప్పిన ప్రాంతాల్లో 24 గంటలు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More