...
...
Next Story

తెలంగాణలో భూముల విలువలో మార్పులు.. ఎక్కడ ఎంత ధరలు ఉండనున్నాయ్?

తెలంగాణలో వ్యవసాయ భూములు కొనాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి కీలక అప్డేట్. రాష్ట్రంలో భూముల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలు భారీగా మారబోతున్నాయి.

Published on: May 19, 2026 10:10 AM IST
Advertisement

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువను సవరించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సాగు, సాగేతర భూముల విలువలు 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో భూముల విలువలో మార్పులు
తెలంగాణలో భూముల విలువలో మార్పులు

స్థానిక పరిస్థితులను బట్టి మూడు రకాలుగా వ్యవసాయ భూముల సవరణలు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు.

వ్యవసాయ భూముల కొత్త ధరలు!

రాష్ట్రవ్యాప్తంగా సాగు భూముల కనీస ధరలను ప్రభుత్వం భారీగా పెంచుతోంది. ముఖ్యంగా ఓఆర్‌ఆర్ లోపల, రహదారుల పక్కన ఉన్న భూములకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రేట్లు ఈ క్రింది విధంగా మారనున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎకరా ప్రభుత్వ విలువ కనిష్ఠంగా రూ.1.75 లక్షలు ఉండగా, దానిని రూ.2.75 లక్షలకు పెంచనున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రస్తుతం ఎకరా ప్రభుత్వ విలువ రూ.8.75 లక్షలు ఉండగా, ఇకపై కనీసం రూ.15 లక్షలు చేయాలని నిర్ణయించారు.

హైదరాబాద్ శివార్లలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో భూముల ధర ఓపెన్ మార్కెట్లో ఎకరా రూ.70 కోట్ల నుండి రూ.150 కోట్ల వరకు పలుకుతోంది. కానీ ప్రభుత్వ ధర రూ.2 - 2.5 కోట్లు మాత్రమే ఉంది. దీనిని ఇప్పుడు రూ.4 కోట్లకు పెంచబోతున్నారు.

అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్ల ధరలు 75 శాతం అప్!

హైదరాబాద్, ఇతర పట్టణాల్లో అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు కొనేవారిపై రిజిస్ట్రేషన్ భారం పెరగనుంది. ఫ్లాట్ల చదరపు అడుగు విలువ దాదాపు 75 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం చదరపు అడుగు ప్రభుత్వ విలువ రూ.3,500 నుండి రూ.4,000 ఉండగా, దానిని రూ.6,000 వరకు పెంచనున్నారు.

కమర్షియల్ ప్రాంతాల్లో రేట్లు

కొత్త ధరలు అమల్లోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ప్రభుత్వం మళ్లీ పరిస్థితులను సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి స్థలాలు, ఇళ్లు కొనాలనుకునే వారు ఈ నెలాఖరు లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆర్థికంగా కలిసివచ్చే అంశం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe