ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం 41 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. బుధవారం బీజాపూర్ జిల్లాలో 41 మంది నక్సలైట్లు సీనియర్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయారని అధికారులు నిర్ధారించారు. మొత్తం 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు ఉంది. కొన్ని రోజులుగా వరుసగా మావోయిస్టులు లొంగుబాటు అవుతున్నారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన లొంగుబాటు, పునరావాస విధానం తమను ఆకట్టుకుందని మావోయిస్టులు తెలిపారు. లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. సీనియర్ పోలీసు అధికారుల ముందు 41 మంది లొంగిపోయారని బీజాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
41 మందిలో 39 మంది మావోయిస్టుల దక్షిణ సబ్-జోనల్ బ్యూరోలో భాగమని, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ధమ్తారి-గరియాబంద్-నువాపాడ డివిజన్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులు అందరూ.. రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ధృవీకరించారని పోలీసులు అధికారులు తెలిపారు. ప్రజలతో గౌరవప్రదమైన, సురక్షితమైన జీవితాన్ని గడపాలనే కోరికను వ్యక్తం చేశారన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ప్రతి ఒక్కరికీ తక్షణ ఆర్థిక సహాయంగా రూ.50,000 అందించారు.
లొంగిపోయిన వారిలో నలుగురు పీఎల్‌జీఏ బెటాలియన్ నంబర్ 1, మావోయిస్టుల వివిధ కంపెనీల సభ్యులు, ముగ్గురు ఏరియా కమిటీ, 11 ప్లాటూన్ మరియు ఏరియా కమిటీ పార్టీ సభ్యులు, ఇద్దరు పీఎల్‌జీఏ సభ్యులు, నలుగురు మిలీషియా ప్లాటూన్ కమాండర్లు, ఒక డిప్యూటీ కమాండర్, ఆరుగురు మిలీషియా ప్లాటూన్ సభ్యులు, మిగిలిన వారు నిషేధిత సీపీఐ(మావోయిస్ట్) ఫ్రంటల్ సంస్థలకు చెందినవారని ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు.
లొంగిపోయిన వారిలో అనేక మంది అధిక రివార్డ్ క్యాడర్ వారు కూడా ఉన్నారు. పాండ్రు హప్కా అలియాస్ మోహన్ (37), బండి హప్కా (35), లక్కు కోర్సా (37), బద్రు పూనెం (35), సుఖ్రామ్ హేమ్లా (27), మంజుల హేమ్లా (25), మంగళి మద్వి అలియాస్ శాంతి (29), జైరాం కడియం (28), పండో మడ్కం అలియాస్ చాందినీపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉంది. ముగ్గురిపై రూ.5 లక్షలు, పన్నెండు మంది క్యాడర్‌పై రూ.2 లక్షలు, ఎనిమిది మంది తలపై రూ.1 లక్ష రివార్డు ఉంది.
{{/usCountry}}లొంగిపోయిన వారిలో అనేక మంది అధిక రివార్డ్ క్యాడర్ వారు కూడా ఉన్నారు. పాండ్రు హప్కా అలియాస్ మోహన్ (37), బండి హప్కా (35), లక్కు కోర్సా (37), బద్రు పూనెం (35), సుఖ్రామ్ హేమ్లా (27), మంజుల హేమ్లా (25), మంగళి మద్వి అలియాస్ శాంతి (29), జైరాం కడియం (28), పండో మడ్కం అలియాస్ చాందినీపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉంది. ముగ్గురిపై రూ.5 లక్షలు, పన్నెండు మంది క్యాడర్‌పై రూ.2 లక్షలు, ఎనిమిది మంది తలపై రూ.1 లక్ష రివార్డు ఉంది.
{{/usCountry}}రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం వినియోగించుకోవాలని, హింసను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావాలని ఎస్పీ యాదవ్ అన్నారు. ఈ లొంగుబాటుతో జనవరి 2024 నుండి మొత్తం 790 మంది మావోయిస్టులు జిల్లాలో ప్రధాన స్రవంతిలో చేరారని ఎస్పీ తెలిపారు. ఇదే సమయంలో జిల్లాలో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 202 మంది నక్సలైట్లు హతమయ్యారని, 1,031 మంది క్యాడర్లను అరెస్టు చేసినట్టుగా చెప్పారు. గత 23 నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో టాప్ క్యాడర్‌లతో సహా 2,200 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని పోలీసులు తెలిపారు.