...
...
Next Story

వరంగల్‌లో బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్ లారీ.. నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు మృతి

వరంగల్‌లో విషాద ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు మృతి చెందారు.

Published on: Jan 27, 2026, 12:43:00 IST
Advertisement

వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణిగా ఉన్న వైద్యురాలు మరణించింది. హంటర్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలు మమతా రాణి పని చేస్తున్నారు. ఆమె కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బాతంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. గత సంవత్సరం నారాయణపేటకు చెందిన వైద్యుడు రాఘవేంద్రతో వివాహం జరిగింది. ఇద్దరూ వరంగల్‌లో వైద్యులుగా పనిచేస్తున్నారు.

వైద్యురాలు మమతా రాణి
వైద్యురాలు మమతా రాణి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దంపతులు డ్యూటీ ముగించుకుని సోమవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుండి ఒక టిప్పర్ లారీ వారి బైక్‌ను ఢీకొట్టడంతో డాక్టర్ మమతాకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు, భర్త ఆమెను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 9 నెలల గర్భంతో ఉన్న డాక్టర్ మమతా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. జార్ఖండ్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్‌ అన్సారీని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

కర్నూలులో మరో ప్రమాదం

మంగళవారం కర్నూలు శివార్లలోని జగన్నాథగట్టు సమీపంలో కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు రోడ్డు డివైడర్‌ను దాటి ఎదురుగా ఉన్న క్యారేజ్‌వేపైకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎదురుగా వచ్చే వాహనం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన తర్వాత బస్సు యాజమాన్యం ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా తరలించడానికి మరొక వాహనాన్ని ఏర్పాటు చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe