తెలంగాణలో మార్చి 2026లో జరిగిన ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 29న అధికారికంగా వెలువడ్డాయి. ఈ ఏడాది మొత్తం 5,26,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం విశేషం. 2025లో 92.78 శాతంగా ఉన్న ఉత్తీర్ణత, ఈసారి 95.15 శాతానికి చేరింది.

ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో కూడా అమ్మాయిలే హవా కొనసాగించారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే 2.19 శాతం మెరుగైన ఫలితాలను సాధించారు. అబ్బాయిల ఉత్తీర్ణత 94.07 శాతంగా ఉంటే, అమ్మాయిలు ఏకంగా 96.26 శాతంతో సత్తా చాటారు. గత కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతుండటం గమనార్హం.
జిల్లా వారీగా చూస్తే..
రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ములుగు జిల్లా 99.30 శాతంతో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. విద్యా సదుపాయాలు తక్కువగా ఉండే మారుమూల జిల్లా ఇలా అగ్రస్థానానికి రావడం వెనుక ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల కనిపిస్తోంది. దీనికి భిన్నంగా, అన్ని వసతులు ఉండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా 89.23 శాతంతో చివరి స్థానంలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. నగర ప్రాంతాల్లోని విద్యార్థులు ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టడం లేదా ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ లోపించడం దీనికి కారణం కావచ్చని విద్యావేత్తలు భావిస్తున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు 99.10 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత శాతం పొందాయి.
తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత 95.15 శాతంగా సాధించినవని బోర్డు వెల్లడించింది.
పాఠశాలల వారీగా గణాంకాలు
{{/usCountry}}తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత 95.15 శాతంగా సాధించినవని బోర్డు వెల్లడించింది.
పాఠశాలల వారీగా గణాంకాలు
{{/usCountry}}రాష్ట్రవ్యాప్తంగా 5,731 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, కేవలం 6 పాఠశాలలు మాత్రమే సున్నా ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశాయి.
ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- https://results.bsetelangana.org , https://bse.telangana.gov.in, https://results.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే Regular & Private (SSC & OSSC) Results అనే లింక్ మీద క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి.
- నెంబర్ సరిచూసుకుని submit బటన్ మీద నొక్కండి.
- మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. మార్కుల షీట్ డౌన్‌లోడ్ చేసుకోవటంతో పాటు ప్రింట్ తీసుకోవడం బెటర్.