...
...
Next Story

ప్రైవేట్ పాఠశాలు, కాలేజీల్లో ఆధార్ ఆపరేటర్లను అనుమతించాలి : విద్యా శాఖ

ప్రైవేట్ పాఠశాలు, కాలేజీల్లో ఆధార్ ఆపరేటర్లను అనుమతించాలని విద్యా శాఖ కోరింది. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.

Published on: Jul 9, 2026, 06:15:57 IST
Advertisement

అర్హులైన విద్యార్థులకు తప్పనిసరి అయిన బయోమెట్రిక్ అప్‌డేట్‌లను పూర్తి చేయడానికి కొన్ని విద్యాసంస్థలు అనుమతించడం లేదని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు తమ క్యాంపస్‌లలోకి ఆధార్ ఆపరేటర్లను అనుమతించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కోరింది.

ఆధార్ క్యాంపులు
ఆధార్ క్యాంపులు

పాఠశాల విద్యా డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కార్యక్రమ పురోగతిని సమీక్షించిన తర్వాత ఈ ఆదేశం వెలువడింది. ఈ సమీక్షలో పాఠశాలకు వెళ్లే పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌ల స్టేటస్, తరగతులకు అంతరాయం కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ పనిని పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను పరిశీలించారు.

విద్యార్థుల చెల్లుబాటు అయ్యే ఆధార్ రికార్డులను నిర్వహించడానికి, వివిధ విద్యార్థి సంబంధిత సేవలను సులభతరం చేయడానికి ఈ కార్యక్రమం అవసరం. అన్ని విద్యా సంస్థలు ఆధార్ బృందాలకు సహకరించాలని విద్యాశాఖ డైరెక్టర్ అన్నారు. ఆధార్ ఆపరేటర్లకు స్థలం, సపోర్ట్, సమన్వయం అందించాలని పాఠశాలలను కోరారు. విద్యాశాఖ జిల్లా విద్యాధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. యూఐడీఏఐ, ఆధార్ బృందాలతో కలిసి పనిచేయాలని, అలాగే ఆధార్ ఆపరేటర్ల సందర్శన షెడ్యూళ్లను పాఠశాలలకు చాలా ముందుగానే తెలియజేయాలని డీఈఓలకు సూచించారు.

ఆధార్ అప్డేట్ ప్రాముఖ్యతను వివరించడానికి ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ సంస్థలతో సమావేశాలు నిర్వహించాలని జిల్లా అధికారులకు కూడా సూచించారు. 'సాధారణ విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలిగించకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి.' అని విద్యాశాఖ డైరెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించి, పురోగతి నివేదికలను సమర్పించాలని డీఈఓలను విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు పూర్తి సహకారం అందించాలని కోరింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks