దీపావళి పండుగ వేళ సొంత ఊళ్లకు, పర్యటనలకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) నుంచి దేశీయ విమాన ఛార్జీలు ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏకంగా విదేశీ ప్రయాణాల కంటే కూడా దేశీయ నగరాలకు వెళ్లే విమాన టికెట్ల ధరలే అధికంగా ఉండటం ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

సాధారణంగా పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ వల్ల ఛార్జీలు పెరగడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి పరిస్థితి మరీ తీవ్రంగా మారింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లోని బ్యాంకాక్ వంటి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వన్-వే విమాన టికెట్ ధరలు రూ. 15,000 నుండి రూ. 18,000 మధ్య అందుబాటులో ఉన్నాయి.
కానీ హైదరాబాద్ నుంచి ఉత్తరాది, ఈశాన్య నగరాలకు వెళ్లే విమాన టికెట్ల ధరలు మాత్రం వీటిని దాటేసి రికార్డు స్థాయికి చేరుకున్నాయి: సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి చండీగఢ్ లేదా పట్నాకు వన్-వే టికెట్ ధర రూ. 9,000 వరకు ఉంటుంది. కానీ ఈ దీపావళి సీజన్‌లో ఇది ఏకంగా రూ. 22,000 దాటిపోయింది.
కోల్‌కతా, గౌహతి, లక్నో, భోపాల్, ఇండోర్ తదితర నగరాలకు వెళ్లే విమాన ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. పండుగ తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రయాణికుల రద్దీ మరింత పెరిగి, ఈ విమాన ఛార్జీలు మరింత ప్రియం కానున్నాయని ట్రావెల్ ఏజెంట్లు హెచ్చరిస్తున్నారు.
పండుగల వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పటికీ, దానికి తగినట్లుగా విమాన సీట్ల లభ్యత లేకపోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విమానయాన రంగానికి చెందిన అంతర్జాతీయ రూట్లలో మార్పులు, విమానాల లభ్యతపై ప్రభావం పడింది.
డిమాండ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా ధరలు పెరిగే డైనమిక్ ప్రైసింగ్ విధానం వల్ల చివరి నిమిషంలో బుక్ చేసుకునే వారిపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.
{{/usCountry}}డిమాండ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా ధరలు పెరిగే డైనమిక్ ప్రైసింగ్ విధానం వల్ల చివరి నిమిషంలో బుక్ చేసుకునే వారిపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.
{{/usCountry}}విమాన ఛార్జీల బాదుడుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు భారతీయ రైల్వే ఊరటనిస్తోంది. పండుగ రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణను ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారత దేశంలోని వివిధ ప్రాంతాలతో అనుసంధానిస్తూ దాదాపు 600 పండుగ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.
వీటిలో పలు రైళ్లలో ఇప్పటికీ బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. విమాన ఛార్జీల భారాన్ని తట్టుకోలేని వారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు చేసుకోవచ్చని సూచించారు.