...
...
Next Story

AIIMS Bibinagar Recruitment : ఎయిమ్స్ బీబీనగర్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు - ఇంటర్వ్యూతోనే ఎంపిక

AIIMS Bibinagar Recruitment 2026 : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), బీబీనగర్ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు జులై 22 లోగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 9, 2026, 21:53:00 IST
Advertisement

AIIMS Bibinagar Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బీబీనగర్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో అవర్లీ (గంటల) ప్రాతిపదికన వివిధ సబ్జెక్టుల బోధనకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఆఫ్ లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీలు - ఇతర వివరాలు

ఎయిమ్స్‌ బీబీనగర్‌లో ఉద్యోగ ఖాళీలు
ఎయిమ్స్‌ బీబీనగర్‌లో ఉద్యోగ ఖాళీలు

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 విభాగాల్లో… 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 జులై 22 వ తేదీ లోపు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. వయోపరిమితి, విద్యార్హతలు, అనుభవాన్ని లెక్కించడానికి 22.07.2026 తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారు. అకడమిక్ సెషన్‌లో గరిష్టంగా కేటాయించే గంటల ఆధారంగా ప్రతి క్లాస్ లేదా గంటకు రూ. 1,000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు.

  • కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ : మొత్తం 40 గంటలు (గరిష్ట పారితోషికం రూ. 40,000)
  • తెలుగు : మొత్తం 30 గంటలు (గరిష్ట పారితోషికం రూ. 30,000)
  • అప్లైడ్ సైకాలజీ : మొత్తం 60 గంటలు (గరిష్ట పారితోషికం రూ. 60,000)
  • అప్లైడ్ న్యూట్రిషన్ & డైటెటిక్స్ : మొత్తం 60 గంటలు (గరిష్ట పారితోషికం రూ. 60,000)
  • అప్లైడ్ సోషియాలజీ : మొత్తం 60 గంటలు (గరిష్ట పారితోషికం రూ. 60,000)
  • స్టాటిస్టిక్స్ : మొత్తం 100 గంటలు (థియరీ 50 గంటలు + ప్రాక్టికల్స్ 50 గంటలు) (గరిష్ట పారితోషికం రూ. 1,00,000)

సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పీజీ (పోస్ట్‌గ్రాడ్యుయేట్) లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉండాలి. దీనితో పాటు కనీసం మూడేళ్ల బోధనా అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 2026 జులై 22 నాటికి 64 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

  1. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  2. మొదట ఎయిమ్స్ బీబీనగర్ అధికారిక వెబ్‌సైట్ www.aiimsbibinagar.edu.in నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  3. నింపిన దరఖాస్తు ఫారమ్‌కు అభ్యర్థులు తమ వయసు, విద్యార్హతలు, అనుభవ ధృవీకరణ పత్రాల స్వీయ ధృవీకరణ నకళ్లను జత చేయాలి.
  4. దరఖాస్తుపై కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అంటించాలి.
  5. పూర్తి చేసిన దరఖాస్తును ఒక కవరులో ఉంచి, దానిపై "Application for the post of Guest Faculty (సబ్జెక్టు పేరు రాయాలి)" అని స్పష్టంగా పేర్కొనాలి.
  6. ప్రభుత్వ లేదా స్వయంప్రతిపత్తి గల సంస్థల్లో పనిచేస్తున్న వారు తమ దరఖాస్తులను ఎన్‌ఓసీ (NOC) తో కలిపి పంపించాల్సి ఉంటుంది.

అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తాత్కాలిక ఇంటర్వ్యూ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నియామక ఉత్తర్వులు ఇచ్చే ముందు వెరిఫై చేస్తారు. ఈ పోస్టులు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నందున, భవిష్యత్తులో ఎయిమ్స్ బీబీనగర్‌లో క్రమబద్ధీకరణ లేదా శాశ్వత ఉద్యోగం కోసం ఎలాంటి హక్కులు ఉండవు. ఏవైనా సందేహాలుంటే recruitment@aiimsbibinagar.edu.in ఈమెయిల్ ఐడీ ద్వారా సంప్రదించవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe