ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు రోజూ ఉదయమే పోషకాలతో కూడిన టిఫిన్ అందించే బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు రెండు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఈ సంస్థలు కీలక అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకున్నాయి.

నాగర్‌కర్నూల్‌లో నిర్మించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం 'జున్నా సోలార్ సిస్టమ్స్' సంస్థ రూ. 5.17 కోట్ల భారీ చెక్కును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు అందించింది. ఈ కార్యక్రమంలో జున్నా సోలార్ సిస్టమ్స్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈఓ అనిల్ బాబు పాల్గొన్నారు.
అలాగే…. వికారాబాద్ జిల్లాలో అధునాతన కిచెన్ నిర్మాణం కోసం 'చైన్ ల్యాబ్స్ ఇండియా' సంస్థ రూ. 4 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేసింది. చైన్ ల్యాబ్స్ ప్రతినిధి డి. సుమంత్, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ ఈ మొత్తాన్ని సీఎం సమక్షంలో ఫౌండేషన్ బోర్డుకు అప్పగించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ముందుకు వచ్చిన ఈ కంపెనీల యాజమాన్యాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
డిసెంబర్ 9 నాటికి రాష్ట్రవ్యాప్తంగా….
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వచ్చే నవంబర్ 30వ తేదీ నాటికే అన్ని సెంట్రల్ కిచెన్ల నిర్మాణం, పరికరాల అమరిక పూర్తి కావాలని స్పష్టం చేశారు. డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రీకృత వంటశాలలను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కిచెన్లలో ఆహారం ఏ విధంగా తయారవుతోందో విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించేలా పర్యటనలు ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించారు.
- హెల్త్ - అకాడమిక్ ట్రాకింగ్ : ప్రభుత్వ పాఠశాలల పిల్లల శారీరక ఎదుగుదల, బరువు, విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు సమగ్రంగా నమోదు చేయాలి.
- యాప్ ద్వారా క్యాలరీల లెక్కింపు : విద్యార్థులకు ఇచ్చే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎంతవరకు పోషకాలు, క్యాలరీలు అందుతున్నాయో సరిచూడటానికి ప్రత్యేక డిజిటల్ యాప్‌లను ఉపయోగించాలి.
- స్థానిక రుచులు - ప్రత్యేక మెనూ : తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ మెనూ రూపొందించాలి.
- కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం : ఈ పథకం నిరంతరం, సుదీర్ఘకాలం సాగేలా చూసేందుకు కిచెన్ల పర్యవేక్షణను నేరుగా రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలి.
"స్కూలుకు సరైన సమయానికి బ్రేక్‌ఫాస్ట్ అందించడం వల్ల పిల్లలు వేళకు పాఠశాలకు వస్తారు. వారు ఆకలితో కాకుండా ఉత్సాహంగా చదువుకోగలుగుతారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు," అని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.
{{/usCountry}}"స్కూలుకు సరైన సమయానికి బ్రేక్‌ఫాస్ట్ అందించడం వల్ల పిల్లలు వేళకు పాఠశాలకు వస్తారు. వారు ఆకలితో కాకుండా ఉత్సాహంగా చదువుకోగలుగుతారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు," అని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.
{{/usCountry}}