తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఓట్ల కోత తప్పడం లేదు. బూత్ స్థాయి అధికారులుసేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అందిన తుది సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 74 లక్షలకు పైగా ఓట్లు తొలగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో తొలగిపోనున్న ఓట్లలో అధిక భాగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 1.14 కోట్ల ఓటర్లు ఉండగా…. కేవలం 71.05 లక్షల మంది మాత్రమే బీఎల్‌వోలకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశారు. మిగిలిన 43.09 లక్షల మంది ఓటర్లు తమ పత్రాలను సమర్పించలేదు. దీంతో ఈ 43 లక్షలకు పైగా ఓట్లను జాబితా నుంచి పూర్తిగా తొలగించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
డిజిటలైజేషన్ లెక్కలు ఇలా…
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, సోమవారం సాయంత్రానికి 2.64 కోట్ల మంది (78.26 శాతం) ఓటర్ల పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రమే పూర్తయింది. మిగిలిన 74 లక్షల మంది ఓటర్లు తమ నింపిన పత్రాలను బీఎల్‌వోలకు అందించలేదు.
ఈ తొలగించనున్న 74 లక్షల ఓట్లలో దాదాపు 73.40 లక్షల (21.70 శాతం) ఓట్లను సేకరించడానికి వీలులేని (అన్‌కలెక్టబుల్) జాబితాలో చేర్చారు. స్థానిక చిరునామాలో లేకపోవడం, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం, మరణించడం, మరియు ఒకరికంటే ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండడం (ASDD - ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్) కారణాల వల్ల వీటిని తొలగిస్తున్నారు. ఇక వివరాల్లో తేడాలు ఉండి, సరైన ధ్రువపత్రాలు సమర్పించని వారి ఓట్లను కూడా అదనంగా తొలగించనున్నారు.
మరోవైపు రాష్ట్ర పరిధిలోనే రెండు, మూడు చోట్ల ఓట్లు కలిగి ఉన్న ఓటర్లను గుర్తించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది. ఈ అధునాతన సాంకేతికత ద్వారా సుమారు 3.18 లక్షల మందికి ఒకటికంటే ఎక్కువ ఓటర్ ఐడీ కార్డులు ఉన్నట్లు అధికారులు పక్కాగా గుర్తించారు. ఈ డూప్లికేట్ ఓట్లను కూడా జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నారు.
డిజిటలైజేషన్‌లో యాదాద్రి టాప్…
{{/usCountry}}మరోవైపు రాష్ట్ర పరిధిలోనే రెండు, మూడు చోట్ల ఓట్లు కలిగి ఉన్న ఓటర్లను గుర్తించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది. ఈ అధునాతన సాంకేతికత ద్వారా సుమారు 3.18 లక్షల మందికి ఒకటికంటే ఎక్కువ ఓటర్ ఐడీ కార్డులు ఉన్నట్లు అధికారులు పక్కాగా గుర్తించారు. ఈ డూప్లికేట్ ఓట్లను కూడా జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నారు.
డిజిటలైజేషన్‌లో యాదాద్రి టాప్…
{{/usCountry}}ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ఏకంగా 94.31 శాతం డిజిటైజేషన్ పూర్తయింది. ఇక రాజధాని హైదరాబాద్ జిల్లా 58.89 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.
- యాదాద్రి భువనగిరి: 94.31% (మొదటి స్థానం)
- జనగామ: 91.98%
- మెదక్: 90.53%
- సూర్యాపేట: 90.45%
- మహబూబాబాద్: 90.11%
- కుమురం భీమ్ ఆసిఫాబాద్: 89.43%
- జగిత్యాల: 89.61%
- నల్గొండ: 89.52%
- పెద్దపల్లి: 88.59%
- సిద్దిపేట: 88.02%
- ఖమ్మం: 87.30%
- హనుమకొండ: 79.99%
- సంగారెడ్డి: 79.51%
- రంగారెడ్డి: 65.16%
- మేడ్చల్-మల్కాజిగిరి: 63.97%
- హైదరాబాద్: 58.89% (చివరి స్థానం)
తదుపరి షెడ్యూల్ వివరాలు…
ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకారం తదుపరి చర్యలు ఈ క్రింది విధంగా ఉంటాయి. ఈనెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
- ఆగస్టు 17న ఓటర్ల ముసాయిదా జాబితా (Draft Electoral Rolls) ప్రచురణ
- ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ
- ఆగస్టు 17 నుంచి అక్టోబరు 15 వరకు నోటీసుల జారీ, అభ్యంతరాల పరిష్కారం
- అక్టోబరు 19న ఓటర్ల తుది జాబితా (Final Electoral Rolls) ప్రచురణ
ఓటర్ల జాబితాను పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించడమే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైన తర్వాత…. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్ని ఓటు తొలగిపోయాయి అనే విషయంపై అధికారికంగా మరింత స్పష్టత రానుంది.