మేడారం జాతరలో పిల్లల కోసం 25 వేల క్యూఆర్ కోడ్ రిస్ట్‌ బ్యాండ్‌లు.. ఇవి ఎలా పని చేస్తాయి?

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో తప్పిపోయిన చిన్న పిల్లల కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. వారిని తల్లిదండ్రులు తిరిగి వెంటనే కలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్‌ను తీసుకొచ్చింది పోలీస్ శాఖ.

Published on: Jan 25, 2026, 16:05:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడారం జాతర సందర్భంగా తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో సహాయపడటానికి తెలంగాణ పోలీసులు వోడాఫోన్ మద్దతుతో క్యూఆర్ కోడ్ ఆధారిత చిల్డ్రన్ ట్రాకింగ్, మానిటరింగ్ సిస్టమ్ రిస్ట్‌బ్యాండ్‌లను ప్రవేశపెట్టారు. గతంలో లేని విధంగా చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ రిస్ట్ బ్యాండ్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

మేడారం జాతర 2026
మేడారం జాతర 2026

రిస్ట్‌బ్యాండ్‌లు క్యూఆర్ కోడ్‌ను కలిగి ఉంటాయి. స్కాన్ చేసినప్పుడు అవి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వివరాలను చూపిస్తాయి. జాతరకు వచ్చే పిల్లలు, దివ్యాంగుల వివరాలను నమోదు చేస్తారు. ఈ సమయంలో తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్లను ఎంటర్ చేస్తారు. ఎవరైనా తప్పిపోయి కనిపిస్తే.. స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. తల్లిదండ్రుల వివరాలు అగుపిస్తాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించవచ్చు. వీటి ద్వారా వేగంగా గుర్తింపు, వెంటనే కలుసుకునేలా చేయవచ్చు.

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భద్రతా నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా తెలంగాణ పోలీసులు దీనిని ప్రారంభించారు. మేడారం జాతర సందర్భంగా వారి కుటుంబాల నుండి విడిపోయిన వ్యక్తులను గుర్తించడానికి, తెలంగాణ పోలీసులు క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ రిస్ట్‌బ్యాండ్‌లను తీసుకొచ్చారు. వోడాఫోన్ మద్దతుతో చిల్డ్రన్ ట్రాకింగ్, మానిటరింగ్ సిస్టమ్‌ పోలీస్ శాఖ తెచ్చింది.

ప్రతి రిస్ట్‌బ్యాండ్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనిని పోలీసులు లేదా స్వచ్ఛంద సేవకులు స్కాన్ చేసినప్పుడు, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సంప్రదింపు వివరాలను చూపిస్తుంది. భారీ జనసమూహం మధ్య కుటుంబాలను త్వరగా తిరిగి కలపడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు. జనసమూహ నిర్వహణ, పిల్లల భద్రతా చర్యల కోసం మహాజాతరకు ముందు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఈ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించింది.

25వేల రిస్ట్‌బ్యాండ్లను అందుబాటులో పెట్టారు. హన్మకొండ హయగ్రీవచారి గ్రౌండ్, హైదరాబాద్‌లోని ఉప్పల్ బస్ స్టేషన్, ఎంజీబీఎస్, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్ స్టేషన్‌, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రిస్ట్ బ్యాండ్ టెక్నాలజీని భక్తులు ఉపయోగించుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More