Bandi Sanjay Comments : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసుల వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో తాను చట్టాన్ని… న్యాయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు.

కరీంనగర్ లో మంగళవారం నిర్వహించిన హిందూ ఎక్తా యాత్ర సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్….. నిజంగా తప్పు చేస్తే తన కొడుకును కూడా క్షమించనని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని… తప్పు రుజువైతే చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే అని వ్యాఖ్యానించారు. తన కుమారుడు మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని చెబుతున్నాడని…. చివరికి న్యాయస్థానమే నిజాన్ని నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కన్నపేగు తల్లడిల్లుతోంది
రాజకీయ కక్షసాధింపులో భాగంగా తన కుటుంబాన్ని రోడ్డుకు లాగడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు . “రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా కుమారుడిని లక్ష్యంగా చేసుకున్నారు. క్రిమినల్ లా చూపిస్తున్నారు. అతనిపై జరుగుతున్న దాడులను చూస్తుంటే వాళ్ల తల్లి తల్లడిల్లిపోతుంది… డ్రిపేషన్ లో కి వెళ్తోంది. ఇలా కుట్రలు పన్నడం దారుణం” అని బండి సంజయ్ మాట్లాడారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని… కోర్టు ఇచ్చే తీర్పును తాము శిరసావహిస్తామని సంజయ్ తెలిపారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని…. కుట్రలు ఎన్ని చేసినా చివరికి సత్యమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు కావాలనే ఇటువంటి వివాదాలను సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
"రాజకీయాల్లో గెలవలేక నా కుటుంబాన్ని రోడ్డుకు లాగారు. నా పార్టీని, నన్ను ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఈ డ్రామాలు ఆడుతున్నారు" అని బండి సంజయ్ మండిపడ్డారు. రాజకీయ పోరాటాలు సిద్ధాంతాల మీద ఉండాలి కానీ, కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు.
వదిలిపెట్టే ప్రసక్తే లేదు - బండి సంజయ్
ఈ కుట్రల వెనుక ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. "నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వారు ఒకటి గుర్తుంచుకోవాలి.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నా మీద, నా కుటుంబం మీద కుట్రలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతాం," అని హెచ్చరించారు. సత్యం వైపే తాము ఉన్నామని, న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
{{/usCountry}}ఈ కుట్రల వెనుక ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. "నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వారు ఒకటి గుర్తుంచుకోవాలి.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నా మీద, నా కుటుంబం మీద కుట్రలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతాం," అని హెచ్చరించారు. సత్యం వైపే తాము ఉన్నామని, న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
{{/usCountry}}“కుట్రలు, కుతంత్రాలతో నా కుటుంబాన్ని బజారున పడేశారో వారిని విడిచిపెట్టను. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసినట్లు మీరు పెట్టిన ఈ నిప్పుతో దళారుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, అవినీతి వ్యవస్థను దగ్ధం చేస్తాను. శ్రీరామచంద్రుడికే అరణ్యవాసం తప్పలేదు. నా గుండె మీద కాషాయం జెండా ఉంది. నా తల మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇటువంటి చీప్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అయితే ఇలాంటి దాడుల వల్ల పార్టీ కార్యకర్తలు మరింత బలోపేతం అవుతారే తప్ప వెనక్కి తగ్గబోరని సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి.
పోలీసుల నోటీసులు :
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2026, మే 13వ తేదీ మధ్యాహ్నం పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమయంలో భగీరథ్ ఇంట్లో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు పోలీసులు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇదే కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ పై పెట్టిన పలు సెక్షన్లను పోలీసులు సవరించారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం BNSS సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 సెక్షన్లుగా సవరించారు.