BDL Bhanur Apprenticeship 2026 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ జారీ అయింది. సంగారెడ్డి జిల్లా భానూర్ యూనిట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ ట్రేడుల్లో 134 అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సరం పాటు ఈ శిక్షణ ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దేశ రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైన యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లు, లాంచర్లు, నీటి అడుగున పనిచేసే ఆయుధాలను తయారు చేసే బీడీఎల్ సంస్థలో శిక్షణ పొందడం యువత భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళాలకు అవసరమైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను రూపొందించే ఈ సంస్థలో ఒక ఏడాది పాటు పని అనుభవం సంపాదించుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు (మొత్తం 134) :
- ఫిట్టర్ : 35
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ : 30
- కోపా (COPA): 22
- ఎలక్ట్రీషియన్ : 11
- మెషినిస్ట్-సి : 09
- టర్నర్ : 08
- వెల్డర్ : 06
- మెకానిక్ డీజిల్ : 04
- మెషినిస్ట్-జి : 03
- కెమికల్ ల్యాబ్ : 03
- ప్లంబర్ : 01
- మెకానిక్ ఆర్ అండ్ ఏసీ : 01
- ఎంఎంవీ : 01
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) పాసై ఉండాలి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లకు ప్రత్యేక అప్రెంటిస్‌షిప్ పథకం ఉన్నందున వారు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి అర్హులు కారు.
వయోపరిమితి విషయానికొస్తే, 30.09.2026 నాటికి జనరల్ అభ్యర్థుల వయసు కనిష్టంగా 14 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకుకేటగిరీని బట్టి 10 నుంచి 15 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం, స్టైపెండ్ వివరాలు
{{/usCountry}}వయోపరిమితి విషయానికొస్తే, 30.09.2026 నాటికి జనరల్ అభ్యర్థుల వయసు కనిష్టంగా 14 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకుకేటగిరీని బట్టి 10 నుంచి 15 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం, స్టైపెండ్ వివరాలు
{{/usCountry}}ఈ అప్రెంటిస్‌షిప్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పూర్తిగా మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పదో తరగతి మార్కులకు 50 శాతం, ఐటీఐ మార్కులకు 50 శాతం సమాన వెయిటేజీ ఇచ్చి, ట్రేడుల వారీగా ప్రత్యేక మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు శిక్షణలో చేరే ముందు వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. శిక్షణ కాలంలో కేంద్ర అప్రెంటిస్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం ఇలా….
అభ్యర్థులు ముందుగా కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ (www.apprenticeshipindia.gov.in) లో అప్రెంటిస్‌గా రిజిస్టర్ చేసుకోవాలి. తమ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేసి, తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు 10వ తరగతి, ఐటీఐ ఒరిజినల్ మార్కుల జాబితాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వచ్చే ఈ-మెయిల్ ఆధారంగా పోర్టల్‌లోని 'Establishment Search' ఆప్షన్‌లోకి వెళ్లి Bharat Dynamics Limited, Bhanur (Reg. No: E06203600009) ను ఎంచుకుని దరఖాస్తు సమర్పించాలి. ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ వివరాలు పదో తరగతి సర్టిఫికెట్‌తో సరిపోలకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ఇతర వివరాల కోసం http://bdl-india.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.