...
...
Next Story

BDL Apprenticeship 2026 : బీడీఎల్‌ హైదరాబాద్‌లో 147 అప్రెంటిస్ ఖాళీలు - దరఖాస్తు తేదీలివే

BDL Hyderabad Apprentice 2026 : హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఆగస్టు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 25, 2026, 11:06:01 IST
Advertisement

BDL Hyderabad Apprentice 2026 : కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక రక్షణ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), హైదరాబాద్‌ లో అప్రెంట్రిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 147 అప్రెంటిస్ ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఖాళీల వివరాలు - స్టైపెండ్

బీడీఎల్‌లో 147 అప్రెంటిస్ ఉద్యోగాలు
బీడీఎల్‌లో 147 అప్రెంటిస్ ఉద్యోగాలు

మొత్తం 147 ఖాళీల్లో 122 గ్రాడ్యుయేట్ (బీఈ/బీటెక్) అప్రెంటిస్ పోస్టులు, 25 డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ట్రేడుల వారీగా ఖాళీలు, చెల్లించే స్టైపెండ్ వివరాలు కింది విధంగా ఉన్నాయి….

  • సివిల్ ఇంజనీరింగ్ : గ్రాడ్యుయేట్ - 2 పోస్టులు, డిప్లొమా - 1 పోస్టు.
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) : గ్రాడ్యుయేట్ - 6 పోస్టులు, డిప్లొమా - 2 పోస్టులు.
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE ): గ్రాడ్యుయేట్ - 43 పోస్టులు, డిప్లొమా - 6 పోస్టులు.
  • మెకానికల్ ఇంజనీరింగ్ : గ్రాడ్యుయేట్ - 69 పోస్టులు, డిప్లొమా - 13 పోస్టులు.
  • కంప్యూటర్ సైన్స్ / ఐటీ : గ్రాడ్యుయేట్ - 2 పోస్టులు, డిప్లొమా - 1 పోస్టు. DCCP (డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ & కమర్షియల్ ప్రాక్టీస్): డిప్లొమా - 2 పోస్టులు.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,900 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. ఈ మొత్తం స్టైపెండ్‌లో 50 శాతం బీడీఎల్ నేరుగా ఇస్తుండగా…. మిగిలిన 50 శాతాన్ని బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ చెల్లిస్తుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా జాతీయ అప్రెంటిస్‌షిప్ శిక్షణ పథకం (NATS) అధికారిక పోర్టల్ ( https://nats.education.gov.in/regular_student.php ( https://nats.education.gov.in/regular_student.php ) లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • ఆ తర్వాత… తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో కూడిన సీవీ లేదా రెజ్యూమ్‌ను hrkbu-app@bdl-india.in ఈమెయిల్ ఐడీకి పంపాలి.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి 2026 ఆగస్టు 6వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించారు.
  • సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు 040-24587917 నంబర్‌ను సంప్రదించవచ్చు.
  • సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఒరిజినల్ విద్యా అర్హతల పత్రాలు… కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe