...
...
Next Story

భారత్ బంద్‌.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా?

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుందా? అనే విషయంపై చాలా మందికి క్లారిటీ లేదు.

Updated on: Feb 12, 2026, 08:00:41 IST
Advertisement

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్‌లో పలు రంగాలకు చెందిన 30 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల ప్రకటించిన భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం, కేంద్రం కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ఈ సమ్మెను నిర్వహిస్తోంది. 10 ప్రముఖ కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

నేడు భారత్ బంద్ జరుగుతుందని భావిస్తున్నందున తెలంగాణ అంతటా ప్రజలు బ్యాంకులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా వంటి రోజువారీ సేవలు పనిచేస్తాయా లేదా అనే దానిపై చాలా మందికి గందరగోళం ఉంది.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంయుక్త కిసాన్ మోర్చా (SKM) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది భారతీయ రైతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వాదించింది. దిగుమతి చేసుకున్న వస్తువులు దేశీయ మార్కెట్లలోకి ప్రవేశించవచ్చని, స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు పోటీ పడటం కష్టమవుతుందని హెచ్చరించింది.

సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ హన్నన్ మొల్లా ఈ ఒప్పందాన్ని రైతులకు చేసిన ద్రోహంగా అభివర్ణించారు. పెరుగుతున్న దిగుమతులు వ్యవసాయ ఆదాయాలను బలహీనపరుస్తాయన్నారు. జీవనోపాధికి ముప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు. రైతు సంఘాలు ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 11 మధ్య అనేక రాష్ట్రాల్లో అవగాహన ప్రచారాలను నిర్వహించాయి. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

మరోవైపు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈ వాణిజ్య ఒప్పందాన్ని సమర్థించారు. కీలక వ్యవసాయ రంగాలను రక్షించామని చెప్పారు. పాల ఉత్పత్తులు, ప్రధాన ఆహార ధాన్యాలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు సుంకాల రాయితీల కింద చేర్చలేదని కేంద్రం తెలిపింది.

స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపారాలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణలో భారత్ బంద్ గురించి తాజా సమాచారం కోసం అధికారిక అప్డేట్స్ చూస్తూ ఉండాలి. రవాణా ఇబ్బందులు ఉండే అవకాశంతో కొన్ని చోట్ల విద్యాసంస్థలు మూసివేసే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe