జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదును ఆన్‌లైన్‌లో నిర్వహించే లక్ష్యంతో తెలంగాణలో త్వరలో ఒక కొత్త పోర్టల్ ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS) పోర్టల్‌ను అమలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత CRS వ్యవస్థ దరఖాస్తుదారులకు 3–5 రోజుల్లో జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందేలా చూస్తుంది. ప్రస్తుతం జనన, మరణ ధృవీకరణ పత్రాలకు సమయం పడుతుంది. దీంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా త్వరగా చేతికి సర్టిఫికేట్లు వస్తాయి.

కొత్త పోర్టల్ దరఖాస్తుదారులకు జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం సహాయక పత్రాలతో ఆన్‌లైన్‌లో ఫారాలను నింపడంలో సహాయపడుతుంది. ఆలస్యంగా నమోదు చేసుకోవడానికి కూడా ఈ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. ఆమోదం పొందిన తర్వాత, తెలంగాణలో జనన, మరణ ధృవీకరణ పత్రాలను పోర్టల్ నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2023 చట్టంగా మారిన తర్వాత, 2023 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి ఒక్కరూ తమ పుట్టిన తేదీని నిరూపించుకోవడానికి, జనన మరణాల రిజిస్ట్రార్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా జనన మరణాల నమోదు చట్టం, 1969 (18 ఆఫ్ 1969) కింద అధికారం పొందిన ఏదైనా ఇతర అధికార సంస్థ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
బర్త్, డెత్ సర్టిఫికేట్లు చాలా పనుల కోసం కావాలి. పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి, జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అని చట్టంలో ఉంది. ఈ పనుల కోసం బర్త్ సర్టిఫికేట్ కావాలి. విద్యా సంస్థలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం, ఓటర్ల జాబితా తయారీ, వివాహ నమోదు, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో లేదా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న ఏదైనా శాసనబద్ధ లేదా స్వయంప్రతిపత్తి గల సంస్థలో ఒక పదవికి నియామకం కోసం, పాస్‌పోర్ట్ జారీ చేయడం, ఆధార్ కార్డు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఇతర ఏ ప్రయోజనానికైనా బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది.
మరోవైపు, పూర్వీకుల ఆస్తులను వారసులకు బదిలీ చేయడానికి, జీవిత బీమా, పింఛన్లను క్లెయిమ్ చేయడానికి, భర్త చనిపోతే.. భార్యకు పెన్షన్ అప్లై చేయడానికి మరణ ధృవీకరణ పత్రం ఉపయోగపడుతుంది.
{{/usCountry}}మరోవైపు, పూర్వీకుల ఆస్తులను వారసులకు బదిలీ చేయడానికి, జీవిత బీమా, పింఛన్లను క్లెయిమ్ చేయడానికి, భర్త చనిపోతే.. భార్యకు పెన్షన్ అప్లై చేయడానికి మరణ ధృవీకరణ పత్రం ఉపయోగపడుతుంది.
{{/usCountry}}