...
...
Next Story

హైదరాబాద్ హోటల్‌లో విశాఖ యువతి మృతి.. ఆసుపత్రిలో పడేసి ప్రియుడి పరార్!

హైదరాబాద్‌లో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. హోటల్‌ గదిలో విశాఖ యువతి మృతి చెందింది. అయితే ఆమెను ఆసుపత్రిలో పడేసి ప్రియుడి అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు.

Updated on: Sep 22, 2026, 14:43:46 IST
Advertisement

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒక యువతి హోటల్ గదిలో తీవ్ర గాయాలతో ప్రియుడు తీసుకెళ్లాడు. ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన ప్రియుడు అక్కడి నుండి పరారయ్యాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన 29 ఏళ్ల యువతి, ఆమె ప్రియుడు కలసి సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సిద్ధిఖీ నగర్‌లో ఉన్న ఒక హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ యువతి నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే మంగళవారం నాటికి వీరి కథ ఊహించని మలుపు తిరిగింది.

యువతి స్పృహతప్పి పడిపోవడంతో హోటల్ సిబ్బంది సహాయంతో ఆమె ప్రియుడు వెంటనే కొత్తగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు, ఆ యువతి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించిన వెంటనే, ప్రియుడు అక్కడి నుండి చాకచక్యంగా జారుకున్నాడు. ప్రేమికురాలిని ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. యువతి ముఖం, తలపై తీవ్రమైన వాపు, గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిని బట్టి ఆమెపై తీవ్రస్థాయిలో భౌతిక దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

హోటల్ గదిలో ప్రియుడు, ప్రియురాలి మధ్య ఏదో విషయమై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగి ఉండవచ్చని, అది కాస్తా తీవ్రమైన దాడికి దారితీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలు బస చేసిన హోటల్ రూమ్‌ను క్లూస్ టీమ్ పరిశీలించి, వేలిముద్రలు, రక్త నమూనాలు సేకరించింది. హోటల్ కాంప్లెక్స్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. హోటల్‌లోకి వారి రాకపోకలు, ప్రియుడు పారిపోయిన మార్గంపై ఫోకస్ చేశారు. హోటల్ మేనేజర్, సిబ్బందిని పోలీసులు ప్రశ్నించి, సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం వరకు గది వద్ద ఏమైనా అరుపులు గానీ, అనుమానాస్పద శబ్దాలు గానీ వచ్చాయా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks