...
...
Next Story

BRAOU MBA Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లు - వెంటనే అప్లయ్ చేసుకోండి

BRAOU MBA Admissions 2026 : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష దరఖాస్తు గడువు ఆగస్టు 5తో ముగియనుంది.

Published on: Aug 4, 2026, 12:10:18 IST
Advertisement

BRAOU MBA Admissions 2026 : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (M.B.A), అలాగే ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు.

అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఎంబీఏ ప్రవేశాలు
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఎంబీఏ ప్రవేశాలు

ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఉద్యోగులకు, దూరవిద్య ద్వారా మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. కాబట్టి అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.

అర్హతలు…

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీలో జనరల్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ (SC), ఎస్టీ (ST) కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు డిగ్రీలో 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాలంటే అభ్యర్థులు తెలంగాణ ఐసెట్ (TG ICET)లో అర్హత సాధించి ఉండాలి. ఐసెట్ రాయని లేదా అందులో అర్హత సాధించని వారి కోసం ఓపెన్ యూనివర్సిటీ ప్రత్యేకంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది.

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణ కేటగిరీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1,500 కాగా, ఎస్సీ, ఎస్టీ, మరియు దివ్యాంగులకు రూ. 1,000 గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్షను ఆఫ్‌లైన్ (పెన్-పేపర్) విధానంలో నిర్వహిస్తారు.

పరీక్షా కేంద్రాలు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9 నగరాల్లో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, హనుమకొండ (వరంగల్) లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ఉన్నాయి.

మరిన్ని వివరాలు, సిలబస్, సమాచార పుస్తకము (Prospectus) కోసం అభ్యర్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.braou.ac.in లేదా www.braouonline.in సందర్శించవచ్చు.ఏమైనా సందేహాలు ఉంటే పనివేళల్లో 040-23680333 / 040-23680555 ఫోన్ నంబర్లలో నేరుగా వర్సిటీ అధికారులను సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks