BRAOU MCA Admissions 2026 : హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి గాను మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ప్రవేశ పరీక్ష (BRAOUMCAET-2026) కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఈ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్లు అయిన www.braou.ac.in లేదా www.braouonline.in ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు
- ఓపెన్ కేటగిరీఅభ్యర్థులకు దరఖాస్తు ఫీజు: రూ. 1,500
- ఎస్సీ (SC), ఎస్టీ (ST), బిసి (BC), మరియు దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు: రూ. 1,000
అభ్యర్థులు ఈ ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా తెలంగాణ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా చెల్లించవచ్చు. సెప్టెంబర్ 28, 2026 లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ వివరాలు
ఈ ఎంసీఏ ప్రవేశ పరీక్షను ఆఫ్‌లైన్ (రాత పరీక్ష) విధానంలో నిర్వహిస్తారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రశ్నపత్రాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో రూపొందిస్తారు.
- పరీక్ష తేదీ: అక్టోబర్ 04, 2026
- సమయం: ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు (1 గంట 30 నిమిషాలు)
కోర్సు ప్రవేశాలు, అర్హతలు ఇతర సమగ్ర సమాచారం కోసం వర్సిటీ కాల్ సెంటర్ నంబర్ 18005990101 లేదా హెల్ప్ డెస్క్ నంబర్లు 040-23680222 / 333 / 444 / 555 లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.