BRAOU UG PG Admissions 2026 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో చేరడానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఇవాళ్టితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ మరో కీలక ప్రకటన చేసింది. దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 9వ తేదీ వరకు పొడిగించింది.
యూజీ, పీజీ కోర్సులు…

ఈ నోటిఫికేషన్ లో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీఏ , బీకామ్ , బీఎస్సీ (B.Sc)లతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఏ , ఎంకామ్, ఎంఎస్సీ , ఎంబీఏ , బీఎల్ఐఎస్సీ , ఎమ్ఎల్ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. వీటితో పాటు పలు రకాల డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు కూడా సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
బీఎస్సీ కోర్సులో చేరాలనుకునే వారు ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఫీజులు చూస్తే…. మొదటి సంవత్సరం రూ. 3,200, ద్వితీయ సంవత్సరం రూ. 3,000, తృతీయ సంవత్సరం రూ. 3,000 ఉంటుంది. సైన్స్ విద్యార్థులకు ల్యాబ్ ప్రాక్టికల్ ఫీజు అదనంగా ఉంటుంది. (సైన్స్ సబ్జెక్టులకు రూ. 1,600, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌కు రూ. 800 చొప్పున, కంప్యూటర్ అప్లికేషన్స్‌కు రూ. 4,000 చొప్పున చెల్లించాలి)
- బీఎల్ఐఎస్సీ (BLISC) : ఒకే ఏడాది కోర్సు. విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు (ఫీజు రూ. 5,300).
- ఎమ్మెల్ఐఎస్సీ (MLISC) : బీఎల్ఐఎస్సీ లో 40 శాతం మార్కులతో పాసైన వారు అర్హులు (ఫీజు రూ. 10,300). పీజీ డిప్లొమా కోర్సులు (1 ఏడాది).
కేవలం కొత్త అడ్మిషన్లే కాకుండా… విశ్వవిద్యాలయంలో సీబీసీఎస్ (CBCS) విధానంలో చదువుతున్న పాత బ్యాచ్‌లకు చెందిన ద్వితీయ, తృతీయ సంవత్సరం యూజీ విద్యార్థులు, పీజీ పాత బ్యాచ్ విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును చెల్లించడానికి మరొక అవకాశం కల్పించారు. గతంలో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా 2017 నుంచి 2025 వరకు వివిధ బ్యాచ్‌లలో చేరిన విద్యార్థులు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా టీఎస్ ఆన్‌లైన్ (కేంద్రాల ద్వారా సెప్టెంబర్ 9లోపు ఫీజు చెల్లించే వెసులుబాటును విశ్వవిద్యాలయం కల్పించింది.
{{/usCountry}}కేవలం కొత్త అడ్మిషన్లే కాకుండా… విశ్వవిద్యాలయంలో సీబీసీఎస్ (CBCS) విధానంలో చదువుతున్న పాత బ్యాచ్‌లకు చెందిన ద్వితీయ, తృతీయ సంవత్సరం యూజీ విద్యార్థులు, పీజీ పాత బ్యాచ్ విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును చెల్లించడానికి మరొక అవకాశం కల్పించారు. గతంలో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా 2017 నుంచి 2025 వరకు వివిధ బ్యాచ్‌లలో చేరిన విద్యార్థులు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా టీఎస్ ఆన్‌లైన్ (కేంద్రాల ద్వారా సెప్టెంబర్ 9లోపు ఫీజు చెల్లించే వెసులుబాటును విశ్వవిద్యాలయం కల్పించింది.
{{/usCountry}}అడ్మిషన్లు, ఫీజు చెల్లింపులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సమీపంలో ఉన్న విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాన్ని నేరుగా సంప్రదించవచ్చు. అలాగే యూనివర్సిటీ అధికారిక పోర్టల్ www.braouonline.in లేదా వెబ్‌సైట్ www.braou.ac.in లలో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉచిత కాల్ సెంటర్ నంబర్ 18005990101 లేదా సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 040-23680 222 / 333 / 555 లలో సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.