రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం పోరాటం చేస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్…. మరోవైపు క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే సీనియర్ నేత జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపి… పార్టీలోకి తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్ చేసింది. ఇప్పటికే ఆయన కేసీఆర్ తో భేటీ కాగా…. అధికారికంగా బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
భారీ బహిరంగ సభ…

జీవన్ రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా జగిత్యాల కేంద్రంగా(మోతె) భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందుకు ఈనెల 20వ తేదీని ముహుర్తంగా ఫిక్స్ చేశారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారు. కేసీఆర్ సమక్షంలోనే జీవన్ రెడ్డి పార్టీలో చేరనున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపడమే లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. జగిత్యాల గడ్డపై నిర్వహించే ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నాయకత్వం…. లక్షలాది మంది జన సమీకరణకు ప్రణాళికలు రచించింది.
సభ నేపథ్యంలో జగిత్యాల పట్టణం మొత్తం గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, జెండాలతో నిండిపోయింది. నియోజకవర్గాల వారీగా ఇన్చార్జులు గ్రామగ్రామాన పర్యటించి కార్యకర్తలను సభకు తరలించే బాధ్యతలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత, రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని, బలాన్ని మరోసారి చాటిచెప్పాలని గులాబీ పార్టీ భావిస్తోంది. సభ విజయవంతం కోసం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
{{/usCountry}}ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని, బలాన్ని మరోసారి చాటిచెప్పాలని గులాబీ పార్టీ భావిస్తోంది. సభ విజయవంతం కోసం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
{{/usCountry}}పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ఈ సభ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. సభను విజయవంతం చేయాలని… జనసమీకరణతో పాటు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇక చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికి వస్తుండటంతో బీఆర్ఎస్ కేడర్‌లో జోష్ తిరిగి రానుంది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్…. చాలా అరుదుగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే జీవన్ రెడ్డి చేరే సభ వేదికగా కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి… కేసీఆర్ ఏం మాట్లాడుతారు అనేది ఆసక్తికరంగా మారింది.