...
...
Next Story

ఫోన్ ట్యాపింగ్‌పై మరో బాంబ్ పేల్చిన మంత్రి పొంగులేటి.. బీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు

ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఇంకా ఆ పరికరాలను వాడుకుంటుందని వ్యాఖ్యానించారు.

Published on: Feb 10, 2026, 20:00:04 IST
Advertisement

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్‌లోని అగ్రనేతలను సిట్ విచారణ చేసింది. అయితే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. భారత రాష్ట్ర సమితి ఇప్పటికీ ప్రజల ఫోన్‌లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం త్వరలో ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుందని చెప్పారు.

మంత్రి పొంగులేటి(ఫైల్ ఫొటో)
మంత్రి పొంగులేటి(ఫైల్ ఫొటో)

'ఇప్పటికీ అధికారులతో కాన్ఫరెన్స్ కాల్‌లో మేం జరిపిన సంభాషణలు బహిరంగంగా రావడం అనుమానాస్పదంగా ఉంది, బహుశా వారు ఇప్పటికీ ఆ పరికరాలను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఎవరెవరు ఇందులో పాల్గొన్నారో, ఏ ఫామ్‌హౌస్‌లు లేదా మామిడి తోటలలో పరికరాలు దాచారో త్వరలో బయటపెడతాం.' అని మంత్రి పొంగులేటి అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని విచారణ జరుగుతోంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఇతర ప్రముఖ వ్యక్తుల ఫోన్‌లపై నిఘా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. వారు ఏం మాట్లాడుకున్నారో వినేవారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఫిబ్రవరి 1న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించింది. అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ కూడా సిట్ ముందు హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును ఇప్పటికే సిట్ ప్రశ్నించింది.

ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెుదలైందనే ప్రశ్నను కూడా కేసీఆర్‌కు అధికారులు వేశారు. కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు? అని దీనికి అనుబంధం ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా? అని కూడా అడిగారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks