...
...
Next Story

స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు బూతులు.. చర్యలు తీసుకుంటారా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసెంబ్లీలోకి వెళ్లేముందు గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో స్పీకర్‌పై తాతా మధు మాట్లాడినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతోంది.

Published on: Sep 7, 2026, 14:35:41 IST
Advertisement

అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారం వివాదానికి దారితీసింది. బ్లాక్ టీషర్ట్ ధరించి.. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులపై తాతా మధు బూతులు తిట్టారని, పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతోపాటుగా మరికొందరు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు

తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి పొన్నం అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని, తాతా మధు వ్యాఖ్యల పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి సంఘీభావం ప్రకటించినట్టుగా చెప్పారు. స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదు.. రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమేనని పొన్నం మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.

'ఒక అట్టడుగు వర్గాల బిడ్డ, దళిత బిడ్డ శాసనసభ స్పీకర్‌గా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకుండా ఉంటారు. కానీ ఆయన పార్టీకి చెందిన నాయకులు మాత్రం బయటకు వచ్చి డ్రామాలు చేస్తున్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ఆయనను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తాతా మధు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలి. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజ్యాంగ పదవిని అవమానించేలా మాట్లాడినా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. శాసనసభ, స్పీకర్ పదవి పట్ల కనీస గౌరవం లేని విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలి.' అని పొన్నం ప్రభాకర్ అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe