Indiramma Indlu Scheme : హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు - సందేహాలుంటే ఈ నెంబర్ కు కాల్ చేయండి..!

Indiramma Towers Hyderabad : హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు, దరఖాస్తు ప్రక్రియపై సందేహాల నివృత్తికి ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 040-24603572 నెంబర్ ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు.

Published on: Jul 26, 2026, 05:12:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Indiramma Towers Hyderabad : హైదరాబాద్ మహానగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే… ఈ పథకానికి సంబంధించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మరియు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రత్యేక కాల్ సెంటర్ హెల్ప్‌లైన్‌ను ప్రభుత్వం శనివారం ప్రారంభించింది.

ఇందిరమ్మ టవర్స్ సందేహాలకు ప్రత్యేక హెల్ప్‌లైన్
ఇందిరమ్మ టవర్స్ సందేహాలకు ప్రత్యేక హెల్ప్‌లైన్

హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఈ హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ప్రజలు ఎలాంటి అపోహలు… గందరగోళానికి గురికాకుండా, దళారులు లేదా మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా అధికారిక సమాచారం తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హెల్ప్‌లైన్ నెంబర్ వివరాలు….

  • ప్రజలు తమ సందేహాల కోసం 040-24603572 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
  • ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు పొందొచ్చు.
  • దరఖాస్తుదారుల సౌకర్యార్థం తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో సమాచారం అందిస్తారు.

తొలి విడతలో 7,680 ఇళ్ల నిర్మాణం

క్యూర్ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అందులో భాగంగా తొలి విడత కింద 16 నియోజకవర్గాల్లో 7,680 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటున్నామని…. దరఖాస్తుదారులు తాము నివసిస్తున్న నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. మీ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్ మరియు వాట్సాప్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

యూపీఐ ద్వారా పేమెంట్…

దరఖాస్తు సమయంలో రూ. 10,000 ఇఎండి మొత్తాన్ని యూపీఐ (UPI) లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ లాటరీలో ఇల్లు రాకపోతే…. ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుల ఖాతాకే నేరుగా తిరిగి జమ చేస్తారు. అందుకే పరిశీలన, కేటాయింపు, వాపసు ప్రక్రియ ముగిసే వరకు మీసేవ రశీదు, చెల్లింపు రశీదు, దరఖాస్తు సంఖ్య మరియు మొబైల్ నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు.

దరఖాస్తు సమయంలో కేవలం ఆధార్ నెంబర్ తెలియజేస్తే సరిపోతుందని, కుల, జీతభత్యాల ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. లాటరీలో ఇల్లు ఎంపికైన తర్వాత మాత్రమే ఈ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయి సమగ్ర ధృవీకరణ పూర్తి చేస్తారు. దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు.

  • కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6.00 లక్షల లోపు ఉండాలి.
  • దరఖాస్తుదారు క్యూర్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలుగా నివాసం ఉంటుండాలి.
  • దరఖాస్తుదారుడికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఓఆర్ఆర్ (ORR) లేదా క్యూర్ పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదు.
  • ఒక కుటుంబం నుంచి ఒక్క దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తారు
  • ఈ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ప్రతి ఫ్లాట్ దాదాపు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్ (1BHK) సౌకర్యాలతో ఉంటుంది.
  • మార్కెట్‌లో ఒక్కో ఫ్లాట్ విలువ రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఉంటుంది.
  • రూ. 5 లక్షల సబ్సిడీ ఇవ్వడంతో పాటు, అన్‌డివైడెడ్ షేర్ (UDS) కింద 20 నుంచి 25 గజాల స్థలాన్ని లబ్ధిదారుని పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుంది. దీంతో లబ్ధిదారుడు కేవలం రూ. 6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More