హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై రెండో చోట్ల కేసులు నమోదు అయ్యాయి. హిందూ దేవతలుగా పూజించే సీతాదేవి, ద్రౌపదీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు నా అన్వేషణ యూట్యూబ్ ఛానెల్‌ను నడిపిస్తున్న యూట్యూబర్ అన్వేష్‌పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు అతడిపై ఫిర్యాదు చేశారు.

విశాఖపట్టణానికి చెందిన యూట్యూబర్ అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా.. హిందూవులు పూజించే సీతాదేవి, ద్రౌపదీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టుగా ఇన్‌స్పెక్టర్ భానుప్రకాశ్ వెల్లడించారు. ఇక తెలుగు నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అన్వేష్‌పై కేసు నమోదైంది.
గత కొన్ని రోజులుగా యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాడు. కొన్ని రోజుల కిందట మహిళలు బయట ఈవెంట్లకు వచ్చినప్పుడు నిండుగా రావాలని, ఇబ్బందులు పడకూడదని నటుడు శివాజీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటి అనసూయ స్పందించారు. తర్వాత ఈ విషయం పెద్దదైంది. తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ అయింది. కొందరు శివాజీకి మద్దతుగా ఉంటే.. మరికొందరు అనసూయ చేసిన వ్యాఖ్యలకు సపోర్ట్ చేశారు.
ఈ వివాదంలోకి యూట్యూబర్ అన్వేష్ కూడా వచ్చాడు. శివాజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు మహిళల బట్టల గురించి మాట్లాడినందుకు ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుపై కూడా తీవ్రస్థాయిలో మాటలు అన్నాడు అన్వేష్. ఈ సందర్భంలోనే సీతాదేవి, ద్రౌపదిలపై కూడా వ్యాఖ్యానించాడు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
చివరకు అన్వేష్ సోషల్ మీడియాలో జనాలు అన్‌ఫాలో చేయడం మెుదలుపెట్టారు. అతడికి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ నడిచింది. చాలా మంది ఫాలోవర్లు కూడా అన్‌ఫాలో చేశారు. తన వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదులు, విమర్శలకు అన్వేష్ స్పందించాడు. శివాజీ, గరికపాటికి క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన కామెంట్స్‌పై సారీ చెప్పాడు. అయితే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని శపిస్తూ వీడియోను విడుదల చేశాడు. అతని నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, తాను చేసింది తప్పైతే రాత్రి రాత్రే రక్తం కక్కుకుని చాస్తా అంటూ చెప్పాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బందుల్లో పడతారని పేర్కొన్నాడు.
{{/usCountry}}చివరకు అన్వేష్ సోషల్ మీడియాలో జనాలు అన్‌ఫాలో చేయడం మెుదలుపెట్టారు. అతడికి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ నడిచింది. చాలా మంది ఫాలోవర్లు కూడా అన్‌ఫాలో చేశారు. తన వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదులు, విమర్శలకు అన్వేష్ స్పందించాడు. శివాజీ, గరికపాటికి క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన కామెంట్స్‌పై సారీ చెప్పాడు. అయితే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని శపిస్తూ వీడియోను విడుదల చేశాడు. అతని నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, తాను చేసింది తప్పైతే రాత్రి రాత్రే రక్తం కక్కుకుని చాస్తా అంటూ చెప్పాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బందుల్లో పడతారని పేర్కొన్నాడు.
{{/usCountry}}