Telangana Cheyutha Pensions : రాష్ట్రంలోని నిరుపేదలు, ఆసరా లేని వర్గాలకు ఊరటనిస్తూ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చేయూత పథకం కింద నూతనంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని హకీంపేట వేదికగా నిర్వహించిన మహిళా సంఘాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా 4.5 లక్షల పెన్షన్లను మంజూరు చేసింది. మొత్తం మంజూరైన పెన్షన్లలో ఏకంగా 3.5 లక్షల పెన్షన్లను కేవలం ఒంటరి మహిళలు, వితంతువులకే అందజేయనున్నారు.
ఈ నెల 12 నుంచి…..
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారుల జాబితాతో పాటు మంజూరు పత్రాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటికే అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు పంపించారు. ఈ నెల 12వ తేదీ నుంచి జిల్లాల్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు.
కొత్త పెన్షన్ దారులకు ఆర్థిక సహాయం అందించే తేదీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీ నుంచి పెన్షన్ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. దశాబ్దాలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ వర్గాలకు చేయూత పెన్షన్లు కొత్త ఆశలను నింపనున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 44 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్లను పొందుతున్నారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 4,016, మిగిలినవారికి రూ. 2,016 అందిస్తున్నారు. ఈ సామాజిక భద్రతా పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఏటా దాదాపు రూ. 10,000 కోట్లు వెచ్చిస్తోంది. కొత్తగా 4.5 లక్షల మంది చేరడంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనున్నప్పటికీ…. ఇచ్చిన హామీ మేరకు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పంపిణీకి శ్రీకారం చుట్టబోతోంది.
{{/usCountry}}ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 44 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్లను పొందుతున్నారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 4,016, మిగిలినవారికి రూ. 2,016 అందిస్తున్నారు. ఈ సామాజిక భద్రతా పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఏటా దాదాపు రూ. 10,000 కోట్లు వెచ్చిస్తోంది. కొత్తగా 4.5 లక్షల మంది చేరడంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనున్నప్పటికీ…. ఇచ్చిన హామీ మేరకు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పంపిణీకి శ్రీకారం చుట్టబోతోంది.
{{/usCountry}}కొత్తగా ఎంపికైన లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో సరిచూసుకోవాలి. స్థానిక పంచాయతీ ద్వారా మీ దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో అధికారులను అడిగి తెలుసుకోవచ్చు.