తెలంగాణలో చికెన్ వ్యాపార రంగంలో గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే జనాలు.. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ కొరత ప్రచారంతో ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా చికెన్ షాపులు బంద్ కూడా కానున్నాయని ప్రకటన వచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న అతి తక్కువ లాభాల మార్జిన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని వ్యాపారులు అనుకుంటున్నారు.

సరఫరా అంతరాయాలు, ధరల హెచ్చుతగ్గులపై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపు యజమానులు ఏప్రిల్ 1 నుంచి తమ వ్యాపారాలను మూసివేయాలని నిర్ణయించారు. పౌల్ట్రీ కంపెనీలు అందిస్తున్న లాభాల మార్జిన్‌కు నిరసనగా వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పౌల్ట్రీ కంపెనీల విధానంపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని చికెన్ వ్యాపారుల ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే 20 రూపాయలు తక్కువ ఇస్తున్నారని చెప్తున్నారు వ్యాపారులు.
'రోజు రోజుకు చికెన్ రేటు పెరుగుతుంది కానీ తమకు ఇచ్చే మార్జిన్ తగ్గిస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. మార్జిన్ పెంచకపోతే వ్యాపారం చేయలేమని షాపులు మూసివేస్తాం.' అని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పేర్కొంది.
ప్రస్తుతం రూ.360 నుంచి రూ. 370 వరకు కిలో చికెన్ ధర ఉంది. ఈ సమస్య ఉప్పల్, ఎల్బీ నగర్ సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బహిరంగ నిరసనలకు దారితీసింది. అక్కడ దుకాణదారులు తమ సమస్యలను తెలియజేస్తూ పోస్టర్లను ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడం ఇకపై లాభదాయకం కాదని వ్యాపారులు అంటున్నారు.
ధరల అసమతుల్యతను పరిష్కరించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని, పౌల్ట్రీ కంపెనీలతో చర్చలు జరపాలని చికెన్ షాప్ ఓనర్స్ సంఘం కోరింది. సరఫరాదారుల ఏకపక్ష నిర్ణయాలు చిన్న వ్యాపార యజమానులను నష్టాల్లోకి నెడుతున్నాయని చెబుతోంది.
{{/usCountry}}ధరల అసమతుల్యతను పరిష్కరించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని, పౌల్ట్రీ కంపెనీలతో చర్చలు జరపాలని చికెన్ షాప్ ఓనర్స్ సంఘం కోరింది. సరఫరాదారుల ఏకపక్ష నిర్ణయాలు చిన్న వ్యాపార యజమానులను నష్టాల్లోకి నెడుతున్నాయని చెబుతోంది.
{{/usCountry}}తమ సమస్యలను పరిష్కరించే వరకు దుకాణాలను తిరిగి తెరవబోమని దుకాణ యజమానులు స్పష్టం చేశారు. న్యాయమైన, సుస్థిరమైన వ్యాపార పరిస్థితులకు నిరసన అవసరమని పేర్కొంటూ, ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రణాళిక ప్రకారం బంద్ జరిగితే.. వినియోగదారులు తక్షణ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. సరఫరాలో ఆకస్మిక నిలుపుదల మార్కెట్లో ధరలు పెరగడానికి దారితీయవచ్చు. గృహాలు, రెస్టారెంట్లు, ఆహార వ్యాపారాలకు కొరతను సృష్టించవచ్చు.
తగ్గిన గుడ్ల ధరలు
ఇదిలా ఉండగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎగుమతులకు అంతరాయం కలగడంతో గత కొన్ని రోజులుగా గుడ్ల ధరలు తీవ్రంగా పడిపోయాయి. పశ్చిమ ఆసియాకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడమే ఈ క్షీణతకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. యుద్ధం నేపథ్యంలో పెరిగిన భద్రతాపరమైన ఆందోళనలు, నౌకా రవాణా మార్గాలకు అంతరాయాల కారణంగా అనేక కీలక ఓడరేవులు, విమానాశ్రయాలు ప్రభావితమయ్యాయి.