...
...
Next Story

3 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు - ఈ స్కూళ్లకు మాత్రం ఎక్కువ హాలీ డేస్...!

రాష్ట్రంలోని సాధారణ పాఠశాలలకు 3 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు రానున్నాయి. ఇక మిషనరీ పాఠశాలలకు అయితే 5 నుంచి 6 రోజుల పాటు హాల్ డేస్ ఉండనున్నాయి.

Published on: Dec 19, 2025, 17:30:22 IST
Advertisement

స్కూళ్లకు వెళ్లే పిల్లలకు సెలవులంటే చాలు ఎగిరి గంతెస్తారు. ప్రతి నెలలో ఏమైనా హాలీ డేస్ ఉన్నాయా లేవా అని చూస్తుంటారు. అయితే ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ తప్ప పెద్దగా సెలవులు ఉండవు. ఈ సెలవులు కూడా స్కూళ్లను బట్టి ఉంటాయి. అధికారికంగా ఒకటి రెండు రోజులు సెలవులు మాత్రమే ఉంటాయి. అయితే ఈసారి రాబోయే క్రిస్మస్ కోసం ఇచ్చే సెలవులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది.

మిషనరీ స్కూళ్లకు ఎక్కువ హాలీ డేస్…

క్రిస్మస్ సెలవులు - 2025
క్రిస్మస్ సెలవులు - 2025

డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండగ ఉండటంతో సెలవు ఉంటుంది. డిసెంబర్ 24వ తేదీన ఆప్షనల్ హాలీ డేగా క్రిస్మస్ ఈవ్ ఉంటుంది. మరుసటి రోజు బాక్సింగ్ డే ఉండటంతో ఆరోజు(డిసెంబర్ 26) కూడా సెలవుగా నిర్ణయించారు. దీంతో సాధారణ పాఠశాలలకు కూడా వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి.

కానీ మిషనరీ స్కూళ్లకు మాత్రం ఎక్కువగా హాలీ డేస్ ఉంటాయి. ఈ తరహా స్కూళ్లకు ఈనెల 23 లేదా 24వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 27వ తేదీతో పూర్తవుతాయి. ఇక డిసెంబర్ 28వ తేదీన ఆదివారం ఉండటంతో ఆ రోజు కూడా స్కూళ్లు మూసివేసే ఉంటాయి. కాబట్టి మిషనరీ స్కూళ్లు… డిసెంబర్ 29వ తేదీన తిరిగి తెరుచుకుంటాయి.

ఇక 2026 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 27 సాధారణ సెలవు దినాలతోపాటు 26 ఐచ్ఛిక సెలవులను కూడా ప్రకటించింది. ప్రతి ఆదివారం, నెలలో రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలని వెల్లడించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks