మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
జనవరి నుంచి మూసీ రివర్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 - జోన్ల వారీగా పనులు
హైదరాబాద్‌లో రేడియల్ రోడ్లు, గండిపేట గోశాల పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2027 జనవరిలో మూసీ పునరుజ్జీవం తొలి దశ పనులు ప్రారంభం కానున్నాయని అధికారులు వెల్లడించారు.మూసీ సుందరీకరణ, రేడియల్ రోడ్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
క్యూర్, ప్యూర్ ప్రాంతాల్లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా పనుల పురోగతిని తెలుసుకున్న ముఖ్యమంత్రి…. ప్రాజెక్టులపై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

జనవరి నుంచి ఫేజ్ 1 పనులు…
ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షించారు. మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతిపై ఆరా తీశారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-1లో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కి.మీ. ప్రాంతాన్ని జోన్-1 ఏ గా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ ప్రాంతాన్ని జోన్-1 బీ గా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2027 లో ఫేజ్-1 పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే ఫేజ్-1 టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు.
మీర్ అలాం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. జనవరి 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు అధికారులు తెలిపారు. మిరాలం చెరువు అభివృద్ధితో పాటు చెరువులో ఎంతో కాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని ఆదేశించారు.
పనుల్లో వేగం పెంచండి - సీఎం ఆదేశాలు
రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ రోడ్ల కోసం భూసేకరణ ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనులు మార్చి 2027 నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో పీఆర్టీఎస్ (Personal Rapid Transit System) ఫేజ్-1 కు సంబంధించి టెక్నో-ఎకానమీ ఫీజిబిలిటీని, కూకట్పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయోడైవర్సిటీ వరకు అలైన్మెంట్ సాధ్యాసాధ్యాలను అధికారులు వివరించారు.
బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్‌బాగ్ మీదుగా రాణీగంజ్ వరకు అలైన్మెంట్ ప్రతిపాదనల గురించి అధికారులు వివరించారు. దీంతో పాటు నెక్లెస్‌రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో PRTS డిపోలను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించి, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. డిపో పరిసరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఉండేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. రూట్స్, డిపోల నిర్మాణం, ఇతర అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు.
సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో IIIT జంక్షన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఫుట్‌బ్రిడ్జి సమీపంలో ప్రధానంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. మార్కెట్ అభివృద్ధి పనులతో మెరుగైన రవాణా సౌకర్యం కోసం సమాంతరంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణలో భాగంగా అవసరమైన చోట ఎస్టీపీల ఏర్పాటు ప్రతిపాదనలను హైడ్రా కమిషనర్ వివరించారు. నగరంలో మెట్ల బావుల పునరుద్ధరణ విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు గండిపేట వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గోశాల పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. నిర్ణీత గడువు ప్రకారం 2027 మార్చి నాటికి గండిపేట గోశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

E-Paper
