...
...
Next Story

ఆ తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు…! సీఎం రేవంత్ కీలక ప్రకటన

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహణపై అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లపై చర్చిస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Published on: Dec 18, 2025, 17:54:46 IST
Advertisement

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన…. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్‌ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల మీద కక్షసాధింపు చర్యలు తమ ప్రభుత్వం చేయలేదన్న ఆయన… ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్చగా పోటీ చేసి ఓట్లు అడిగారని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని పేద ప్రజలకు తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి కారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2029లోనూ ఇదే మాదిరి ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు. 2/3 మెజార్టీతో 2029లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 1/3తో బీఆర్ఎస్ ఉంటే 2/3 మెజార్టీతో కాంగ్రెస్‌ ఉంటుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

చర్చించి నిర్ణయం తీసుకుంటాం - సీఎం రేవంత్ రెడ్డి

ఇక రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో అసెంబ్లీ పెట్టి నిర్ణయిస్తామన్నారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటామని… 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తామన్నారు. ప్రజాస్వామ్యయుతంగా చర్చించి… ఎన్నికలపై ఓ నిర్ణయాానికి వస్తామని క్లారిటీ ఇచ్చారు.

తమకు 7,527 గ్రామ పంచాయతీల్లో (66 శాతం) ప్రజలు అందించిన ఆశీర్వాదం.. ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల ఆశీర్వాదంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండిండినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks