మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే హరీశ్ రావ్ మాట్లాడుతూ… విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు.కాంగ్రెస్ సర్కార్‌కు ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి లేదా హౌస్ కమిటీ వేయాలని సవాల్ విసిరారు.
హరీశ్ రావ్ ప్రశ్నలు….

ఎలాంటి పర్మిషన్లు, లైసెన్సులు లేకుండా డీజిల్ జనరేటర్లతో దర్జాగా స్టోన్ క్రషర్ దందా చేస్తున్నారని హరీశ్ రావ్ ఆరోపించారు. అధికారులు రెండుసార్లు పట్టుకున్నా, నోటీసులు ఇచ్చినా రాఘవ కన్స్ట్రక్షన్స్‌పై యాక్షన్ ఏదీ…? అని ప్రశ్నించారు.
"నిబంధనల ప్రకారం 25 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష ఎందుకు వేయలేదు..? బీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడికి రాత్రికి రాత్రే జైలు.. అధికార పార్టీ మంత్రికి మాత్రం అండదండలా..?రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే నైతికంగా రాజీనామా చేయాలి” అని హరీశ్ రావ్ డిమాండ్ చేశారు.
“రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు.. ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసు. రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డే. సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుంది. అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలు చెబుతుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి" అని హరీష్ రావ్ డిమాండ్ చేశారు.
విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్
ఈ విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సీబీసీఐడీ విచారణకు సిద్ధమనిఅసెంబ్లీలో ప్రకటించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటుగా ఆరోపణలు ఉన్న అన్ని కంపెనీలపైనా విచారణ జరిపిస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక ప్రవేశపెడతామని ప్రకటించారు.
{{/usCountry}}ఈ విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సీబీసీఐడీ విచారణకు సిద్ధమనిఅసెంబ్లీలో ప్రకటించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటుగా ఆరోపణలు ఉన్న అన్ని కంపెనీలపైనా విచారణ జరిపిస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక ప్రవేశపెడతామని ప్రకటించారు.
{{/usCountry}}సిరిసిల్ల ఇసుక మాఫియాపై సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావు పై విచారణకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గంగుల కమలాకర్ సంబంధించి ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్ పై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్ పై విచారణకు సిద్ధమని… అదే సమయంలో రాఘవ కన్స్ట్రక్షన్ తో ఆరోపణలు ఉన్న అన్నింటిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని ప్రకటించారు. విచారణలో నిజాలు నిగ్గు తేలుస్తామని వ్యాఖ్యానించారు.
“ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఎలాంటి తప్పిదాలు జరిగినా మా ప్రభుత్వం ఉపేక్షించదు. అందులో భాగంగానే రాఘవ కన్స్ట్రక్షన్స్ కు నోటీసులు ఇచ్చింది.. చర్యలు తీసుకోమంది. రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి మైనింగ్ శాఖ ఫైన్ కట్టించుకుంది. ఇది వాళ్లు కనిపెట్టి పిర్యాదు చేస్తే తీసుకున్న చర్యలు కాదు. మా ప్రభుత్వమే వివరాలు తీసుకుని చర్యలు తీసుకుంది. మంత్రిపై బురద చల్లాలని, వాళ్ల పైరవీలకు సహకరించడం లేదని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ల బ్లాక్ మెయిల్ లకు ప్రభుత్వం లొంగదు. సీబీసీఐడీ విచారణతో నిజాలు నిగ్గు తెలుస్తాం”అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.